Site icon NTV Telugu

IND vs SA: లంచ్‌ బ్రేక్‌.. దక్షిణాఫ్రికా ఆధిక్యం 508 పరుగులు!

Ind Vs Sa Test

Ind Vs Sa Test

భారత్‌తో గువాహటి వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా పూర్తి పట్టు సాధించింది. ప్రస్తుతం నాలుగో రోజు కొనసాగుతోండగా.. లంచ్‌ బ్రేక్‌ సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 220 రన్స్‌ చేసింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 508 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. క్రీజులో ట్రిస్టన్‌ స్టబ్స్‌ (60), వియాన్‌ ముల్డర్‌ (29) ఉన్నారు. ఈ జోడి 5వ వికెట్‌కు 71 బంతుల్లో 42 పరుగులు జత చేసింది.

Also Read: Telangana Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారు.. మూడు విడతలుగా ఎన్నికలు!

26/0 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన దక్షిణాఫ్రికా భారీ స్కోర్ దిశగా దూసుకెళుతోంది. ఓపెనర్‌ ర్యాన్‌ రికెల్టన్‌ (35), ఐడెన్‌ మార్‌క్రమ్‌ (29) ఫర్వాలేదనిపించారు. కెప్టెన్‌ టెంబా బవుమా (3) విఫలమయ్యాడు. టోనీ డీ జోర్జి (49) తృటిలో హాఫ్‌సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 3, వాషింగ్టన్‌ సుందర్‌ 1 వికెట్‌ తీసుకున్నారు. పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌ అస్సలు ప్రభావం చూపలేకపోయారు. నితీశ్‌ కుమార్‌ రెడ్డి అయితే బంతినే అందుకోలేదు. అనూహ్యంగా యశస్వి జైస్వాల్‌ ఒక ఓవర్‌ బౌలింగ్‌ వేశాడు. ఈ టెస్టులో భారత్ డ్రా చేసుకోవాలన్నా లేదా గెలవాలన్నా ఏదైనా అద్భుతమే జరగాలి.

Exit mobile version