India Playing XI vs మూడు South Africa For 2nd ODI: వన్డేల సిరీస్‌లో భాగంగా ఈరోజు భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. రాయ్‌పుర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో మధ్యాహ్నం 1.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో వన్డేలో కూడా గెలిచి.. టెస్ట్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. మరోవైపు మొదటి వన్డేలో ఓడిన సఫారీలు రాయ్‌పుర్‌లో గెలిచి సిరీస్ సమం చేయాలని చూస్తున్నారు. రెండు టీమ్స్ బలంగా ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో చూద్దాం.
వన్డేల్లో నిలదొక్కుకోవాలని చూస్తున్న ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్‌లో అయినా మంచి ఇన్నింగ్స్ ఆడతాడేమో చూడాలి. మొదటి వన్డేలో సీనియర్స్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో రాణించగా.. విరాట్ కోహ్లీ సెంచరీ బాదాడు. మరోసారి రో-కో రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు. నాలుగో స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ విఫలమయ్యాడు. రుతురాజ్ స్థానంలో రిషబ్ పంత్‌ను ఆడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఒక్క మ్యాచ్‌కే రుతురాజ్ పక్కన పెడితే విమర్శలు రావడం ఖాయం. తుది జట్టులో ఆటగాళ్లను పదే పదే మార్చుతున్నాడని కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు ఉన్న నేపథ్యంలో జట్టు యాజమాన్యం ఏం చేస్తుందో? చూడాలి. తుది జట్టులో ఈ ఒక్క మార్పే ఉండే అవకాశాలు ఉన్నాయి. బౌలింగ్‌లో మంచి ఆరంభం దక్కినా ఆ తర్వాత పేసర్లు ధారాళంగా పరుగులు ఇచ్చారు. ఇది ఇప్పుడు భారత్‌ను కలవరపాటుకు గురి చేసింది. అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణలు ఈ మ్యాచ్‌లో ఎలా బౌలింగ్ చేస్తారో చూడాలి. 4 వికెట్లతో సత్తాచాటిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై భారీ అంచనాలున్నాయి. ఆల్‌రౌండర్‌లు వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాలు ఈ మ్యాచ్‌లో అయినా న్యాయం చేస్తారో చూడాలి.
Also Read: Maruthi Mahalakshmi: నా సంతానం ఎవరిదో తేల్చండి.. సీఎంకు పూర్వ పీఠాధిపతి రెండో భార్య విజ్ఞప్తి!
దక్షిణాఫ్రికా రెండో వన్డేలో మార్పులు చేయబోతోంది. తొలి వన్డేలో విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ తెంబా బవుమా, స్పిన్నర్ కేశవ్ మహరాజ్ తుది జట్టులోకి రానున్నారు. ర్యాన్ రికిల్‌టన్ స్థానంలో బవుమా ఆడనున్నాడు. సుబ్రయెన్ స్థానంలోకి కేశవ్ వస్తాడు. బ్రెవిస్, జోర్జి కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. బ్రీజ్కే, యాన్సెన్, బోష్‌లు టీమిండియాను ఓడించినంత పని చేశారు. రెండో వన్డేలో సీనియర్స్ చెలరేగితే తిరుగుండదని సఫారీలు భావిస్తున్నారు. యాన్సెన్, బర్గర్, కేశవ్‌ల బౌలింగ్‌ను భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
తుది జట్లు (అంచనా):
భారత్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్/రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్
దక్షిణాఫ్రికా: టెంబా బావుమా (కెప్టెన్), ఐడెన్ మార్క్రామ్, క్వింటన్ డి కాక్, మాథ్యూ బ్రీట్జ్కే, టోనీ డి జార్జి, డెవాల్డ్ బ్రూవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, నాండ్రే బర్గర్ మరియు ఓట్నీల్ బార్ట్‌మన్.
