KL Rahul Record: కేఎల్ రాహుల్ నయా రికార్డు.. 2004 తర్వాత ఇదే మొదటిసారి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KL Rahul Creates Record in Wellington: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వెల్లింగ్టన్లోని బేసిన్ రిజర్వ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రెండు వికెట్లకు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేయడంలో రాహుల్ కీలక పాత్ర పోషించాడు. దీంతో సేనా దేశాల (సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా)పై భారత ఓపెనర్లు తొలి రెండు వికెట్లకు రెండు సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పిన అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
గతంలో ఈ ఘనతను సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్ సాధించారు. 1979లో ది ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గవాస్కర్–చేతన్ చౌహాన్ జోడీ 213 పరుగులు, గవాస్కర్–దిలీప్ వెంగ్‌సర్కార్ జోడీ 153 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అలాగే 1985-86లో సిడ్నీలో జరిగిన టెస్టులో గవాస్కర్–కృష్ణమాచారి శ్రీకాంత్ జోడీ 191 పరుగులు, గవాస్కర్–మొహిందర్ అమర్నాథ్ జోడీ 224 పరుగులు జోడించింది. 2003-04లో మెల్బోర్న్ వేదికగా జరిగిన టెస్టులో వీరేంద్ర సెహ్వాగ్–ఆకాశ్ చోప్రా జోడీ 141 పరుగులు, సెహ్వాగ్–రాహుల్ ద్రవిడ్ జోడీ 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాయి. ఇప్పుడు 2026లో వెల్లింగ్టన్ టెస్టులో కేఎల్ రాహుల్–యశస్వి జైస్వాల్ జోడీ 130 పరుగులు, రాహుల్–దేవదత్ పడిక్కల్ జోడీ 165 పరుగులు జోడించి ఈ జాబితాలో చోటు సంపాదించాయి.
Also Read
- Sarfaraz Khan: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లీక్ ఆరోపణలు.. ఎట్టకేలకు స్పందించిన సర్ఫరాజ్ ఖాన్!
- IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్ మాకో లెక్కే కాదు.. టీమిండియా కెప్టెన్ హాట్ కామెంట్స్..!
- KL Rahul History: కేఎల్ రాహుల్ రికార్డుల జాతర.. టీమిండియా మొదటి బ్యాటర్‌గా అరుదైన ఘనత!
- Ind Vs Nepal: నేపాల్‌పై భారత్-ఏ భారీ విజయం.. 306 పరుగుల తేడాతో వరల్డ్ రికార్డు బద్దలు..
అంతేకాదు న్యూజిలాండ్ గడ్డపై ఒకే టెస్టు ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీ భాగస్వామ్యాల్లో భాగమైన భారత బ్యాటర్ల జాబితాలోనూ లోకేష్ రాహుల్ చేరాడు. గతంలో రాహుల్ ద్రవిడ్ 1998-99లో హామిల్టన్‌లో, గౌతమ్ గంభీర్ 2009లో వెల్లింగ్టన్లో ఈ ఘనత సాధించారు. ఇప్పుడు రాహుల్ కూడా 2026 వెల్లింగ్టన్ టెస్టులో ఈ జాబితాలో తన పేరు నమోదు చేసుకున్నాడు. మ్యాచ్ మూడో రోజు మూడో సెషన్ ఆట కొండగుతోంది. భారత్ 90 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 119.. శుభ్‌మన్ గిల్ 20 పరుగులతో క్రీజులో ఉన్నాడు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌట్ అయింది.
తాజావార్తలు
-
KL Rahul Record: కేఎల్ రాహుల్ నయా రికార్డు.. 2004 తర్వాత ఇదే మొదటిసారి!
-
Redmi R80 5G, R80m 5G: 6,000mAh బ్యాటరీతో Redmi R80 5G, R80m 5G ఫోన్లు.. 6.9 ఇంచెస్ డిస్ప్లే, 33W ఛార్జింగ్!
-
Earthquake in Peru: పెరూలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదు..!
-
Sarfaraz Khan: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లీక్ ఆరోపణలు.. ఎట్టకేలకు స్పందించిన సర్ఫరాజ్ ఖాన్!
-
MLA VS Babu De*ath Mystery: కొలత్తూరు ఎమ్మెల్యే వీఎస్ బాబు మృతిపై అనుమానాలు.. తెరపైకి సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్ మాకో లెక్కే కాదు.. టీమిండియా కెప్టెన్ హాట్ కామెంట్స్..!
-
World Television Day 2026: బ్లాక్ అండ్ వైట్ నుంచి స్మార్ట్ టీవీ వరకు.. ఆసక్తికర ప్రయాణం.!
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!