భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లోని నాలుగో మ్యాచ్‌కు విశాఖ వేదికైంది. రెండు రోజుల క్రితమే విశాఖ చేరుకున్న ఇరు జట్లు ముమ్ముర సాధన చేస్తున్నాయి. ఈరోజు రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కీలక మార్పులతో బరిలోకి దిగనుంది. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని అతడి ఫిట్‌నెస్‌పై మేనేజ్‌మెంట్ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది.
హార్దిక్ పాండ్యా స్థానంలో స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. మిడిలార్డర్‌లో నిలకడైన బ్యాటింగ్‌తో పాటు అనుభవం ఉన్న ఆటగాడిగా శ్రేయాస్ జట్టుకు అదనపు బలంగా మారనున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు అవకాశాలు రాని శ్రేయాస్‌కు ఇది మంచి ఛాన్స్ అనే చెప్పాలి. చివరి రెండు టీ20ల్లో రాణిస్తే.. టీ20 ప్రపంచకప్ 2026లో కూడా అవకాశాలు దక్కే ఛాన్స్ ఉంది. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ నాలుగో టీ20లో ఆడనున్నట్లు తెలుస్తోంది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై అక్షర్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ కీలక పాత్ర పోషించగలడు. దీంతో ఆల్‌రౌండర్ విభాగం మరింత బలపడనుంది.
ఓపెనర్ సంజు శాంసన్ నాలుగో టీ20 మ్యాచ్‌లో ఆడనున్నాడు. వరుస వైఫల్యాల తర్వాత సంజుకు మరో అవకాశం ఇస్తుంది మేనేజ్మెంట్. ఈ మ్యాచ్‌లో అతడు మంచి ఇన్నింగ్స్ ఆడితే.. తన స్థానాన్ని నిలబెట్టుకునే అవకాశాలు మెరుగవుతాయి. మొదటి మూడు మ్యాచ్‌లలో సంజు విఫలమైన విషయం తెలిసిందే. తిలక్ వర్మ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడం సంజూ, శ్రేయస్‌కు సానుకూలాంశంగా మారింది. రొటేషన్‌లో భాగంగా జస్ప్రీత్ బుమ్రా స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ తుది జట్టులోకి రావొచ్చు.
Also Read: Lok Sabha: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. రాష్ట్రపతి ప్రసంగం
భారత తుది జట్టు (అంచనా):
అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్.
