Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shubman Gill on Mohammed Siraj Dropped: న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్లో ముగిసిన తొలి టెస్టులో స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌కు భారత తుది జట్టులో చోటు దక్కలేదు. కొన్నేళ్లుగా టెస్టుల్లో ప్రధాన పేసర్లలో ఒకడిగా ఉంటున్న సిరాజ్.. తుది జట్టులో లేకపోవడంతో క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. సిరాజ్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడంపై మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు. వీరికి తోడు రాజకీయ నేతలు సైతం రంగంలోకి దిగారు. దీంతో గత 5 రోజులుగా పెను దుమారమే రేగింది. సిరాజ్‌ను ప్లేయింగ్ 11లోకి తీసుకోకపోవడంపై ఎట్టకేలకు టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పందించాడు. ఈ నిర్ణయం తీసుకోవడం తనకు చాలా కష్టంగా అనిపించిందని వెల్లడించాడు. సిరాజ్ తనకు మంచి స్నేహితుడని, భారత జట్టులోకి వచ్చిన తొలి రోజుల నుంచి అతడితో కలిసి ఆడుతున్నానని తెలిపాడు. అయితే ఆటగాళ్ల ఎంపికలో ప్రస్తుత ఫామ్‌కే ప్రాధాన్యత ఇచ్చామని గిల్ స్పష్టం చేశాడు.
మొదటి టెస్ట్ మ్యాచ్ అనంతరం మీడియాతో గిల్ మాట్లాడుతూ.. ‘సిరాజ్ నాకు చాలా మంచి స్నేహితుడు. అతడిని తుది జట్టు నుంచి తప్పించడం చాలా కఠినమైన నిర్ణయం. మేమిద్దరం కలిసి చాలా మ్యాచ్‌లు ఆడాం. భారత జట్టులోకి వచ్చిన తొలి రోజుల నుంచే అతడితో నాకు పరిచయం ఉంది. ఈ టెస్టుకు ముందే అతడితో మాట్లాడి.. ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో వివరించాను. అతడు కూడా నా నిర్ణయాన్ని అర్థం చేసుకున్నాడు’ అని గిల్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో భారత్ నలుగురు స్పెషలిస్ట్ పేసర్లతో బరిలోకి దిగింది. జస్ప్రీత్ బుమ్రా, అన్షుల్ కాంబోజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణలకు తుది జట్టులో అవకాశం కల్పించింది. స్పిన్ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేసింది. దీంతో మహమ్మద్ సిరాజ్‌తో పాటు గుర్నూర్ బ్రార్ కూడా జట్టులో చోటు కోల్పోయారు.
Also Read
- Tom Latham: మా అంచనాలు తప్పాయి.. ఒత్తిడిలోనూ ఆ ఇద్దరు అద్భుతంగా పోరాడారు!
- WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
- Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
- IND vs NZ: డ్రాగా ముగిసిన తొలి టెస్టు.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలకు గట్టి ఎదురుదెబ్బ!
‘ప్రతి ఆటగాడి కెరీర్లోనూ ఫామ్ లేమి రోజులు కూడా ఉంటాయి. అలాంటి సమయంలో ఆటగాడి గత ప్రదర్శనల కంటే ప్రస్తుత ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుని తుది జట్టును ఎంపిక చేయాల్సి ఉంటుందది. సిరాజ్‌తో పాటు గుర్నూర్ బ్రార్ కూడా జట్టులో చోటు దక్కించుకోలేకపోవడం దురదృష్టకరం’ అని గిల్ చెప్పాడు. జడేజా, సిరాజ్‌ల బౌలింగ్ ఈ మ్యాచ్‌లో భారత్‌కు మరింత ఉపయోగపడేదా అని అడిగిన ప్రశ్నకు.. ‘అలా అని నేను భావించడం లేదు’ అని గిల్ సమాధానమిచ్చాడు. ఆటగాళ్ల పేర్లు, గత అనుభవాల కంటే ప్రస్తుత ఫామ్ ఆధారంగానే తుది జట్టును ఎంపిక చేశామని స్పష్టం చేశాడు.
ఇటీవల సిరాజ్ ప్రదర్శన కూడా ఆశించిన స్థాయిలో లేదని చెప్పాలి. 2026లో అఫ్గానిస్థాన్, శ్రీలంకతో జరిగిన మూడు టెస్టుల్లో అతడు 57 ఓవర్లు బౌలింగ్ చేసి 28.60 సగటుతో ఐదు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల్లో నాలుగు వికెట్లకే పరిమితమయ్యాడు. ఆ పర్యటనలో అతడి బౌలింగ్ వేగం కూడా తగ్గింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుని సిరాజ్‌ను పక్కన పెట్టినట్లు గిల్ చెప్పాడు. సిరాజ్ ఇప్పటివరకు 48 టెస్టులు ఆడి 144 వికెట్స్ తీశాడు. బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ 6/15.
తాజావార్తలు
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
Rahman : ‘రామాయణ’ కోసం 12 బడా సినిమాలకు ‘నో’ చెప్పిన ఏఆర్ రెహమాన్
-
Bisleri on FSSAI Action: వాటర్ వివాదంపై బిస్లరీ వివరణ.. FSSAI చర్యలపై కీలక ప్రకటన!
-
Record: సుకుమార్ క్యాంప్‌లో కిరణ్ అబ్బవరం.. పోస్టర్ మిస్టరీ?
-
Tom Latham: మా అంచనాలు తప్పాయి.. ఒత్తిడిలోనూ ఆ ఇద్దరు అద్భుతంగా పోరాడారు!
ట్రెండింగ్
-
WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
IND A vs PAK A: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్‌పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..
-
Abdul Samad: భారత్‌పై విజయం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు