మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వడోదరలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే ఆరంభం అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత ప్లేయింగ్ 11లోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. పొట్టలో గాయం కారణంగా కొన్ని నెలలుగా శ్రేయస్ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఆకట్టుకోవడంతో అతడు జట్టులోకి వచ్చాడు. గాయం నుంచి కోలుకుని వచ్చిన శ్రేయస్‌కు ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది.
ఈ మ్యాచ్ కోసం భారత్ ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగింది. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్ స్పిన్నర్లు కాగా.. హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలు పేసర్లు. ఈ సిరీస్‌కు రిషభ్ పంత్ దూరమయ్యాడు. అతడి స్థానంలో కీపర్ ధ్రువ్ జురెల్ జట్టులోకి వచ్చాడు. 2024లో సొంతగడ్డపై భారత్‌ను న్యూజిలాండ్ వైట్‌వాష్ చేసిన చేసింది. మరోసారి టీమిండియాపై సత్తాచాటాలని కివీస్ భావిస్తోంది. గత పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా చూస్తోంది.
Also Read: iphone 17 Price Drop: ఇది కదా బాసూ ఆఫర్ అంటే.. సగం ధరకే ‘ఐఫోన్ 17’ ఫోన్!
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఆర్ జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ.
న్యూజిలాండ్: డెవన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే (కీపర్), మైఖేల్ బ్రాస్‌వెల్ (కెప్టెన్), జాక్ ఫౌక్స్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జెమిసన్, ఆదిత్య అశోక్.
