NTV Telugu Site icon

IND Vs AUS: రెండో టీ20కి వరుణుడు అడ్డంకి.. ఆలస్యంగా ప్రారంభం కానున్న మ్యాచ్

Toss

Toss

IND Vs AUS: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నాగపూర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యం కానుంది. నాగపూర్‌లో ప్రస్తుతం వర్షం కురవకపోయినా.. గత రాత్రి భారీ వర్షం మైదానాన్ని ముంచెత్తింది. దీంతో అవుట్ ఫీల్డ్‌తో పాటు పిచ్ చిత్తడిగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు టాస్ కూడా వేయలేదు. పిచ్‌పై కవర్లు కప్పి ఉంచారు. అవుట్ ఫీల్డ్‌లో ఒకట్రెండు చోట్ల తేమ శాతం అధికంగా ఉంది. దాంతో మైదానాన్ని మ్యాచ్‌కు అనువుగా సిద్ధం చేసేందుకు స్టేడియం సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే రాత్రి 8 గంటలకు అంపైర్లు మరోసారి పిచ్‌ను పరిశీలించిన తర్వాతే టాస్ వేయడంపై క్లారిటీ వస్తుంది.

Read Also:Eating Banana: షాకింగ్ న్యూస్.. ఈ అరటిపండ్లు తింటే మనుషులు చనిపోతారా?

ప్రస్తుతానికి ఈ మ్యాచ్ సజావుగా జరిగే అవకాశాలు కూడా కనిపించడం లేదు. మరోవైపు మైదానాన్ని మబ్బులు కమ్మేశాయి. మళ్లీ వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ వర్షం కురవకపోయినా ఓవర్లు కుదించి అంపైర్లు మ్యాచ్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉందని కామెంటేటర్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాగా ఈ మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో ఉంది. మొహాలీలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.