Ind Vs Afg: టాప్ ఆర్డర్‌ను నలిపేసిన ప్రసిద్ధ్.. వన్డేల్లో బెస్ట్ స్పెల్‌తో రికార్డు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నివారం చెన్నైలోని చేపాక్ స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ నిప్పులు చెరిగే బంతులతో చెలరేగిపోయాడు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ప్రసిద్ధ్ తన పదునైన బౌలింగ్‌తో కోలుకోలేని దెబ్బ తీశాడు. పవర్‌ప్లేలోనే వరుసగా ఐదు ఓవర్ల స్పెల్ వేసిన అతడు, ఆఫ్ఘన్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. వన్డే కెరీర్లో ప్రసిద్ధ్ కృష్ణకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం.
మ్యాచ్ ప్రారంభం నుంచే భారత బౌలర్లు ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. ప్రసిద్ధ్ కృష్ణ తాను వేసిన మొదటి ఓవర్ తొలి బంతికే ప్రమాదకర ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (5)ను అవుట్ చేసి భారత్‌కు తొలి బ్రేక్‌థ్రూ ఇచ్చాడు. ఆ తర్వాత తన మూడో ఓవర్లో రహ్మత్ షా (5)ను, నాలుగో ఓవర్లో ఇబ్రహీం జద్రాన్ (11)ను పెవిలియన్ చేర్చాడు. ఇక ఐదో ఓవర్లో డార్విష్ రసూలీ (1) వికెట్ కూడా పడగొట్టి పవర్‌ప్లే ముగిసేసరికే 4 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రసిద్ధ్ ధాటికి ఆఫ్ఘనిస్తాన్ పవర్‌ప్లే ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి కేవలం 37 పరుగులు మాత్రమే చేయగలిగింది. మరో ఎండ్‌లో గుర్నూర్ బ్రార్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ వికెట్లు దక్కలేదు. ఆ తర్వాత అజ్మతుల్లా ఒమర్జాయ్ క్రీజులో నిలదొక్కుకోవడంతో 19.1 ఓవర్లలో ఆఫ్ఘన్ స్కోరు 99/4 కి చేరింది.
Also Read
- Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
- Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
- India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
- Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
గత వన్డే మ్యాచ్‌లో విపరీతమైన వేడి కారణంగా ఇబ్బంది పడ్డామని, ఈ మ్యాచ్‌లోనూ వాతావరణం అలాగే ఉందని టాస్ సమయంలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో మూడు మార్పులు చేశారు. ప్రసిద్ధ్ కృష్ణ, హర్ష్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి జట్టులోకి పునరాగమనం చేశారు.
తాజావార్తలు
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
-
Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!