Site icon NTV Telugu

IND vs AFG Schedule 2026: భారత్-అఫ్గానిస్థాన్‌ షెడ్యూల్ విడుదల.. మ్యాచ్‌లు ఎప్పుడు, ఎక్కడంటే?

Ind Vs Afg Schedule 2026

Ind Vs Afg Schedule 2026

IND vs AFG 2026 Schedule: అఫ్గానిస్థాన్‌ క్రికెట్ జట్టు భారత్ పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో ఒక టెస్ట్ మ్యాచ్‌తో పాటు మూడు వన్డేలు జరగన్నాయి. ఈ విషయాన్ని భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) ధ్రువీకరించింది. అఫ్గానిస్థాన్‌ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ఈరోజు విడుదల చేసింది. ఈ పర్యటన జూన్ 6న ప్రారంభమవుతుంది. భారత అభిమానులకు ఈ సిరీస్ ఆసక్తికరంగా ఉండనుంది. ఎందుకంటే భారత్, అఫ్గానిస్థాన్‌ జట్లు ఇటీవలి కాలంలో అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాయి.

ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ జూన్‌ 6 నుంచి 10 వరకు న్యూచంఢీగడ్‌లో జరుగనుంది. మహారాజా యాదవీంద్ర సింగ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్ స్టేడియంలో జరగనున్న తొలి అంతర్జాతీయ టెస్ట్‌ మ్యాచ్‌ ఇదే కానుంది. భారత్-అఫ్గానిస్థాన్‌ టీమ్స్ ఇప్పటివరకు ఒక టెస్ట్ మ్యాచ్‌ మాత్రమే ఆడాయి. ఆ టెస్ట్ మ్యాచ్‌ 2018లో జరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు టెస్ట్ ఫార్మాట్లో ఇరు జట్లు ముఖాముఖిగా తలపడలేదు. వన్డే సిరీస్ జూన్ 14న ప్రారంభమవుతుంది. మొదటి వన్డే ధర్మశాలలో, రెండో వన్డే జూన్ 17న లక్నోలో జరగనుంది. చివరి వన్డే మ్యాచ్ జూన్ 20న చెన్నైలో జరుగుతుంది.

Also Read: Shoaib Akhtar-India: అదృష్టం వల్లే విజయాలు.. వరల్డ్‌ కప్ గెలిచే అర్హత భారత్‌కు లేదు!

భారత్-అఫ్గానిస్థాన్‌ షెడ్యూల్‌ ఇదే:
# టెస్ట్‌ మ్యాచ్‌: జూన్‌ 6-10, న్యూ చండీగఢ్‌
# మొదటి వన్డే: జూన్‌ 14, ధర్మశాల
# రెండో వన్డే: జూన్‌ 17, లక్నో
# మూడో వన్డే: జూన్‌ 20, చెన్నై

Exit mobile version