వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో పర్యాటన శ్రీలంక జట్టు ఓటమి దిశగా పయనిస్తుంది. తొలి ఇన్నింగ్స్ లో 164 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే ఫాలో ఆన్ ఆడుతున్న లంకేయులు మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేశారు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కు (580/4) ఇంకా 303 పరుగులు వెనకబడి శ్రీలంక ఉంది. ఓవర్ నైట్ స్కోర్ 26/2 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. మైఖేల్ బ్రేస్ వెల్(3/50), మ్యాచ్ హెన్రీ(3/44), టీమ్ సౌథీ( 1/22), డౌడ్ బ్రేస్ వెల్(1/19), టిక్నర్(1/21 ) ధాటికి తొలి ఇన్నింగ్స్ లో 164 పరుగులకే చాపట్టేసింది. శ్రీలంక ఇన్సింగ్స్ లో కెప్టెన్ దిముత్ కరుణరత్నే(89) టాప్ స్కోరర్ గా నిలిచాడు.
Also Read : Sajjala Ramakrishna Reddy: 2019లో దారుణమయిన ఓటమిని మర్చిపోయారా?
న్యూజిలాండ్ పిలుపుతో మేరకు ఫాలో ఆన్ ఆడుతున్న శ్రీలంక.. సెకెండ్ ఇన్సింగ్ లో 2 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసి ఇన్సింగ్స్ పరాభవాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. సెకెండ్ ఇన్సింగ్స్ లోనూ కరుణరత్నే951) హాఫ్ సెంచరీతో రాణించగా.. కుశాల్ మెండిస్ పోరాడుతున్నాడు. సౌథీ, డౌగ్ బ్రేస్ వెల్ తలో వికెట్ దక్కిది. అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 580 పరుగులు చేసి ఇన్సింగ్స్ ను డిక్లేర్ చేసింది. కేన్ విలియమ్సన్(215), హెన్రీ నికోల్స్(200) డబుల్ సెంచరీలతో చెలరేగగా.. కాన్వే 78 పరుగులు చేశాడు. కాగా, రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేసి, భారత్ ను వెనక్కునెట్టి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరాలని కలలు కన్న శ్రీలంక ప్రస్తుతం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేని స్థితిలో ఉంది. తొలి టెస్టులో సూపర్ సెంచరీతో శ్రీలంక విజయావకాశాలను దెబ్బకొట్టిన విలియమ్సన్ ఈ మ్యాచ్ లోనూ ఆ జట్టును గెలవకుండా చేశాడు.
