Imad Wasim: మాజీ భార్య సంచలన ఆరోపణలు.. మౌనం వీడిన పాక్ క్రికెటర్ ఇమాద్ వసీం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Imad Wasim: ప్రముఖుల వ్యక్తిగత జీవితాలు తరచూ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతుంటాయి. ముఖ్యంగా విడాకులు, రెండో వివాహం, కుటుంబ విభేదాలకు సంబంధించిన వార్తలు వెలుగులోకి వస్తే అవి క్షణాల్లో వైరల్ అవుతాయి. ఇప్పుడు అలాంటి వివాదంలో చిక్కుకున్నారు పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం. ఆయన మాజీ భార్య, డిజిటల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సానియా అష్ఫాక్ తాజాగా చేసిన ఆరోపణలు పాకిస్తాన్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లోనూ చర్చకు దారితీశాయి. కుటుంబ హింస నుంచి పిల్లల సంరక్షణ వరకు పలు అంశాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు కారణమవగా, వాటిపై ఇమాద్ వసీం కూడా స్పందించడం ఈ వివాదాన్ని మరింత హాట్ టాపిక్‌గా మార్చింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస పోస్టులు చేసిన సానియా అష్ఫాక్, తమ వైవాహిక జీవితంలో ఇమాద్ తనను మానసికంగా వేధించాడని, తనపై పెత్తనం చెలాయించాడని ఆరోపించారు. గర్భధారణ సమయంలో కూడా తనను మోసం చేశాడని, ఆయన ప్రవర్తన వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. విడాకుల అనంతరం తమ ముగ్గురు పిల్లల బాధ్యతను పూర్తిగా తనపైనే వదిలేశాడని, పిల్లల ఖర్చులు భరించడంలోనూ, వారిని కలవడంలోనూ ఇమాద్ ఆసక్తి చూపడం లేదని ఆమె ఆరోపించారు.
Also Read
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
- Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
సానియా చేసిన ఆరోపణల్లో మరో కీలక అంశం గృహహింస కేసు. 2025 జూలైలో యునైటెడ్ కింగ్డమ్లో గృహహింస ఆరోపణలపై ఇమాద్ వసీంను అరెస్టు చేశారని ఆమె పేర్కొన్నారు. తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకోవాలని ఇమాద్ కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చారని, పరిస్థితి విషమించడంతో సామాజిక సేవా సంస్థలు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని కూడా ఆరోపించారు. ఇటీవల సామాజిక కార్యకర్తలు పిల్లలతో మాట్లాడాలనుకుంటున్నారా అని ఇమాద్‌ను ప్రశ్నించినప్పటికీ ఆయన స్పందించలేదని, పిల్లలను కలవడానికి కూడా ప్రయత్నించలేదని సానియా వెల్లడించారు. తన పిల్లల భవిష్యత్తు కోసం పోరాటం కొనసాగిస్తానని, నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుందని ఆమె స్పష్టం చేశారు.
ఈ ఆరోపణలు వైరల్ అయిన కొద్దిసేపటికే ఇమాద్ వసీం కూడా తన మౌనం వీడారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్పందించిన ఆయన, ఈ విషయంపై తాను బహిరంగంగా మాట్లాడటం ఇదే చివరిసారి అని తెలిపారు. వ్యక్తిగత కారణాల వల్లే సానియాకు విడాకులు ఇచ్చానని, ఆ అధ్యాయం తన జీవితంలో ముగిసిపోయిందని పేర్కొన్నారు. తన ప్రస్తుత భార్య నైలా రాజా విడాకుల తర్వాతే తన జీవితంలోకి వచ్చిందని, ఈ వివాదంలో ఆమెను లాగవద్దని మాజీ భార్యను కోరారు. తన ప్రస్తుత కుటుంబాన్ని ఈ వివాదానికి దూరంగా ఉంచాలని, గత విషయాలను వదిలేసి సానియా తన జీవితంపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఇమాద్ ప్రకటన వెలువడిన వెంటనే సానియా కూడా మరో ఇన్స్టాగ్రామ్ పోస్టుతో స్పందించారు. తన పిల్లల ఫోటోను పంచుకుంటూ, తనకు అవసరమైన ప్రతిదీ అల్లా ప్రసాదించాడని, ఇక ఇతర విషయాల గురించి తాను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. దీంతో ఇద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది.
ఇమాద్ వసీం, సానియా అష్ఫాక్ 2019 ఆగస్టులో ఇస్లామాబాద్‌లో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2025 డిసెంబర్లో ఇద్దరూ అధికారికంగా విడాకులు తీసుకున్నారు. అనంతరం 2026 ఫిబ్రవరిలో కంటెంట్ క్రియేటర్, ఇన్ఫ్లుయెన్సర్ నైలా రాజాతో తన రెండో వివాహాన్ని ఇమాద్ వసీం అధికారికంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఇప్పడు ఈ మాజీ జంట పరస్పరం విభిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించలేదు.
Imad Wasim’s ex-wife, Sannia Ashfaq, hit back at his Instagram statement, alleging that he cheated on her during her pregnancy, was arrested in the UK in July 2025 over domestic abuse allegations, and had distanced himself from their children. pic.twitter.com/RxwuBjuqVR
— Thakur (@hassam_sajjad) June 26, 2026
- Tags
- Imad Wasim
- Sania Ashfaq
తాజావార్తలు
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
-
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
-
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!