ICC: ధోనీ రిటైర్మెంట్కు రెండేళ్లు.. స్పెషల్ వీడియో పోస్ట్ చేసిన ఐసీసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC Posted Dhoni Video: టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి రెండేళ్లు పూర్తవుతోంది. 2020, ఆగస్టు 15న ధోనీ తన రిటైర్మెంట్ను ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అయితే ధోనీ రిటైర్మెంట్కు రెండేళ్లు పూర్తి కావడంతో ఐసీసీ ప్రత్యేక నివాళులర్పించింది. ఈ సందర్భంగా ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ధోనీకి సంబంధించిన కొన్ని చిరస్మరణీయ స్మృతులను చూపించింది. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీతో సహా ఐసీసీ ఈవెంట్లను టీమిండియా ధోనీ సారథ్యంలో గెలుచుకున్న క్షణాలను ఈ వీడియోలో చూపించింది. ఈ వీడియో పోస్ట్ చేసిన కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also: Jio 5G Smart Phone: జియో నుంచి 5జీ స్మార్ట్ ఫోన్.. ధర ఎంత ఉంటుంది?
Also Read
- First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
- 2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Gautam Gambhir: "కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు".. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
అంతర్జాతీయ కెరీర్లో ధోనీ మూడు ఫార్మాట్లలో 17,266 పరుగులు చేశాడు. అందులో 15 సెంచరీలు ఉన్నాయి. అతడి సగటు 44.96గా నమోదైంది. కాగా క్రికెట్ చరిత్రలో అన్ని ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక కెప్టెన్‌గా ధోనీ ఘనత సాధించాడు. 2007లో టీమిండియా మొదటి టీ20 ప్రపంచకప్ గెలుచుకుంది. ధోనీ నాయకత్వంలోనే 2010, 2016లో టీమిండియా ఆసియా కప్ టైటిళ్లను సొంతం చేసుకుంది. అటు 2011లో టీమిండియా వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకోవడంలో ధోనీ కీలక పాత్ర పోషించాడు. ధోనీ కెరీర్లో అతిపెద్ద విజయం ఇదే. అంతేకాకుండా 2013లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో ధోనీ నాయకత్వంలోనే టీమిండియా ఇంగ్లండ్‌ను ఓడించింది.
“… from 1929 hrs consider me as Retired.”#OnThisDay in 2020, India superstar @msdhoni bid goodbye to international cricket.
A tribute to the legend 📽️
— ICC (@ICC) August 15, 2022
తాజావార్తలు
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?