Site icon NTV Telugu

ICC: ధోనీ రిటైర్మెంట్‌కు రెండేళ్లు.. స్పెషల్ వీడియో పోస్ట్ చేసిన ఐసీసీ

Dhoni

Dhoni

ICC Posted Dhoni Video: టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి రెండేళ్లు పూర్తవుతోంది. 2020, ఆగస్టు 15న ధోనీ తన రిటైర్మెంట్‌ను ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అయితే ధోనీ రిటైర్మెంట్‌కు రెండేళ్లు పూర్తి కావడంతో ఐసీసీ ప్రత్యేక నివాళులర్పించింది. ఈ సందర్భంగా ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ధోనీకి సంబంధించిన కొన్ని చిరస్మరణీయ స్మృతులను చూపించింది. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీతో సహా ఐసీసీ ఈవెంట్లను టీమిండియా ధోనీ సారథ్యంలో గెలుచుకున్న క్షణాలను ఈ వీడియోలో చూపించింది. ఈ వీడియో పోస్ట్ చేసిన కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read Also: Jio 5G Smart Phone: జియో నుంచి 5జీ స్మార్ట్ ఫోన్.. ధర ఎంత ఉంటుంది?

అంతర్జాతీయ కెరీర్‌లో ధోనీ మూడు ఫార్మాట్లలో 17,266 పరుగులు చేశాడు. అందులో 15 సెంచరీలు ఉన్నాయి. అతడి సగటు 44.96గా నమోదైంది. కాగా క్రికెట్ చరిత్రలో అన్ని ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక కెప్టెన్‌గా ధోనీ ఘనత సాధించాడు. 2007లో టీమిండియా మొదటి టీ20 ప్రపంచకప్‌ గెలుచుకుంది. ధోనీ నాయకత్వంలోనే 2010, 2016లో టీమిండియా ఆసియా కప్ టైటిళ్లను సొంతం చేసుకుంది. అటు 2011లో టీమిండియా వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకోవడంలో ధోనీ కీలక పాత్ర పోషించాడు. ధోనీ కెరీర్‌లో అతిపెద్ద విజయం ఇదే. అంతేకాకుండా 2013లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో ధోనీ నాయకత్వంలోనే టీమిండియా ఇంగ్లండ్‌ను ఓడించింది.

Exit mobile version