Site icon NTV Telugu

ఈనెల 21న టీ20 ప్రపంచకప్ షెడ్యూల్: ఐసీసీ

టీ20 ప్రపంచకప్‌పై ఐసీసీ కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగనున్న పురుషుల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఈ నెల 21న విడుదల చేయనున్నట్లు ఐసీసీ తెలిపింది. ప్రపంచకప్ టోర్నీ మ్యాచ్‌లకు సంబంధించి టికెట్ల అమ్మకం ఫిబ్రవరి 7 నుంచి మొదలవుతుందని ఐసీసీ స్పష్టం చేసింది. 12 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీ అక్టోబర్ 13 నుంచి నవంబర్ 16 మధ్య జరగనున్నట్లు తెలుస్తోంది.

Read Also: ఇకనైనా విహారికి అవకాశం ఇవ్వండి: గంభీర్

టీ20 ర్యాంకింగ్స్‌లో గత ఏడాది చివరి నాటికి టాప్‌-8లో ఉన్న జ‌ట్లు ప్రపంచకప్‌-2022కు నేరుగా అర్హత సాధించాయి. మిగ‌తా నాలుగు స్థానాల కోసం క్వాలిఫైయ‌ర్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. భార‌త్, పాకిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ జట్లు ఇదివరకే ప్రపంచకప్‌కు అర్హత సాధించగా.. శ్రీలంక, వెస్టిండీస్, న‌మీబియా, స్కాట్లాండ్ జ‌ట్లు క్వాలిఫైయ‌ర్ మ్యాచ్‌లలో తలపడతాయి.

Exit mobile version