టీ20 ప్రపంచకప్-2022 షెడ్యూల్.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే..?

ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. రెండు గ్రూపులుగా సూపర్-12 మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రస్తుతానికి గ్రూప్-1లో ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆప్ఘనిస్తాన్… గ్రూప్-2లో భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ ఉన్నాయి. మిగతా జట్లు క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడి సూపర్-12లోకి రంగప్రవేశం చేస్తాయి.

Read Also: సచిన్ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ

అక్టోబర్ 23న హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఆ రోజే భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. గత టీ20 ప్రపంచకప్ తరహాలోనే వచ్చే ప్రపంచకప్‌లోనూ టీమిండియాకు పాకిస్థాన్‌తోనే తొలి మ్యాచ్ జరగనుంది. నవంబర్ 9న తొలి సెమీఫైనల్, నవంబర్ 10న రెండో సెమీఫైనల్ నిర్వహిస్తారు. నవంబర్ 13న మెల్‌బోర్న్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అటు క్వాలిఫయర్ మ్యాచ్‌లలో శ్రీలంక, నమీబియా, వెస్టిండీస్, స్కాట్లాండ్ సహా మరో రెండు జట్లు తలపడనున్నాయి.