ICC: శ్రీలంక క్రికెట్(ఎస్ఎల్‌సీ)పై విధించిన సస్పెన్షన్‌ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆదివారం ఎత్తేసింది. ఎస్ఎల్‌సీపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించడానికి ICC ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఈ రోజు తక్షణమే శ్రీలంక క్రికెట్(ఎస్ఎల్‌సీ)పై నిషేధాన్ని ఎత్తివేసింది. సస్సెన్షన్ నుంచి ఐసీసీ బోర్డు పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. ఇప్పుడు సంతృప్తి వ్యక్తం చేసింది. ఎస్ఎల్‌సీ ఇకపై సభ్యత్వ బాధ్యతలను ఉల్లంఘించదు’’ అని ప్రకటనలో పేర్కొంది.
Read Also: Maldives: మాల్దీవుల పార్లమెంట్‌లో గందరగోళం.. ఎంపీల కొట్లాట.. వీడియో వైరల్..
నవంబర్ 2023లో శ్రీలంక క్రీడా శాఖ మంత్రి రోషన్ రణసింగ్, అర్జున్ రణతుంగా నేతృత్వంలో మధ్యంతర కమిటీని ప్రవేశపెట్టిన తర్వాత, రాజకీయ జోక్యం కారణంగా ఐసీసీ శ్రీలంక క్రికెట్‌ని సస్పెండ్ చేసింది. భారతదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో శ్రీలంక జట్టు ఫెయిల్యూర్ తర్వాత శ్రీలంక క్రికెట్‌పై ఆ దేశ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం, ఇది ఐసీసీ నిబంధనలకు వ్యతిరేకంగా ఉండటంతో సస్పెండ్ చేసింది.
క్రికెట్ ప్రపంచకప్ మొత్తం టోర్నీలో శ్రీలంక అత్యంత పేలవ ప్రదర్శన చేసింది. 9 మ్యాచుల్లో కేవలం 2 మ్యాచుల్ని మాత్రమే గెలిచింది. ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 స్లాట్‌ను కూడా కోల్పోయింది.
శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడు షమ్మీ సిల్వా ఐసీసీ బోర్డుకు చాలాసార్లు విజ్ఞప్తి చేయడంతో శ్రీలంక అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి అనుమతించబడింది. ఐసీసీ బోర్డు నవంబర్ 21న సమావేశమై శ్రీలంక ద్వైపాక్షిక క్రికెట్, ఐసీసీ ఈవెంట్స్ లలో అంతర్జాతీయ పోటీ పడాలని నిర్ణయించింది. అయితే, ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచకప్ శ్రీలంకలో జరగాల్సి ఉన్నా.. అక్కడి నుంచి దక్షిణాఫ్రికాకు తరలించారు. సస్పెన్షన్ తర్వాత, శ్రీలంక ఈ ఏడాది ప్రారంభంలో జింబాబ్వేతో వైట్ బాల్ సిరీస్‌కు ఆతిథ్యం ఇచ్చింది.
