NTV Telugu Site icon

టెస్ట్ ర్యాంకింగ్స్ లో తమ స్థానాలు నిలుపుకున్న కోహ్లీ, రోహిత్

భారత్ – న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఈ మ్యాచ్ కారణంగా ఆటగాళ్ల స్థానాలు మారాయి. మొదట బ్యాటింగ్ లో ఈ మ్యాచ్ లో పాల్గొనని రోహిత్ శర్మ 5వ స్థానం, విరాట్ కోహ్లీ 6వ స్థానంలో కొనసాగుతూ తమ ర్యాంకింగ్స్ ను కాపాడుకున్నారు. అయితే ఈ మ్యాచ్ లో అర్ధశతకం చేసిన ఓపెనర్ గిల్ 6 స్థానాలు మెరుగుపరుచుకుని 66వ స్థానానికి రాగ.. వికెట్ కీపర్ సాహా కూడా ఒక హాఫ్ సెంచరీతో 9 స్థానాలు ఎగబాకి 99 వ స్థానానికి వచ్చాడు. ఇక ఈ మ్యాచ్ లో అరంగేట్రం చేసిన శ్రేయాస్ అయ్యర్ రెండు ఇన్నింగ్స్ లలో చేసిన సెంచరీ, అర్ధ సెంచరీ సహాయంతో ఏకంగా 74వ స్థానానికి వచ్చాడు.

ఇక బౌలర్ల ర్యాంకింగ్స్ లో మొదటి టెస్ట్ లో ఆడిన అశ్విన్ తన రెండవస్థానాని కాపాడుకోగా… ఆడని బుమ్రా ఒక్క స్థానం పడిపోయి 10వ ర్యాంక్ లో నిలిచాడు. అలాగే ఆల్ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా రెండవ స్థానంలో ఉండగా.. అశ్విన్ మూడవ స్థానంలో ఉన్నాడు.