NTV Telugu Site icon

ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత మహిళల హాకీ జట్టు ఎంపిక…

టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత మహిళల హాకీ జట్టుకు రాణి రాంపాల్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తుందని హాకీ ఇండియా ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్‌ కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టును గత వారం ప్రకటించిన హెచ్‌ఐ కెప్టెన్‌ పేరును మాత్రం వెల్లడించలేదు. ఇక వైస్‌ కెప్టెన్‌లుగా గోల్‌కీపర్‌ సవిత, దీప్‌ గ్రేస్‌ ఎక్కా వ్యవహరిస్తారని తెలిపింది. ఒలింపిక్స్‌లో జట్టును నడిపించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని చెప్పింది రాణి. ఇప్పటివరకు దేశం తరఫున 241 మ్యాచ్‌లు ఆడి 118 గోల్స్‌ చేసింది రాణి రాంపాల్.