NTV Telugu Site icon

భారత్ – పాక్ : కంపెనీలకు కూడా పండుగే…!

పాకిస్తాన్‌తో భారత్ మ్యాచ్ అంటే కేవలం క్రికెట్ అభిమానులకు మాత్రమే కాదు కంపెనీలకు కూడా పండుగే. ఎలా అంటారా? ఈ మ్యాచ్‌ను కోట్లాది మంది చూస్తారు. మ్యాచ్ జరిగేటప్పుడు యాడ్స్ ఇస్తే భారీ పబ్లిసిటీ వస్తుంది. ఒకేసారి కోట్ల మందికి ప్రాడక్ట్ చేరువవుతుంది. మరోవైపు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ రమీజా రాజా…బాబర్‌ సేనకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు.

భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే…హడావిడి అంతా ఇంతా ఉండదు. రెండు దేశాల అభిమానులతో పాటు న్యూస్‌ ఛానల్స్‌, స్పోర్ట్స్‌ ఛానల్స్‌ పోటాపోటీ కథనాలు నడుపుతాయ్. ఆదివారం జరిగే మ్యాచ్‌ కోసం…క్రీడాభిమానులందరూ టీవీలకే అతుక్కుపోతారు. అదే మ్యాచ్ ఆదివారం వస్తే.. ఇంకేమైనా ఉందా? రికార్డు స్థాయిలో టీఆర్‌పీలు నమోదవుతాయి. ఈ నెల 24న కూడా ఇదే జరగబోతోంది. పాకిస్తాన్‌తో భారత్ మ్యాచ్ అంటే కేవలం క్రికెట్ అభిమానులకు మాత్రమే కాదు కంపెనీలకూ పండుగే. భారత్‌-పాకిస్తాన్‌ టీ 20 మ్యాచ్‌ను కోట్లాది మంది చూస్తారు. మ్యాచ్ జరిగేటప్పుడు యాడ్స్ ఇస్తే భారీ పబ్లిసిటీ వస్తుంది. ఒకేసారి కోట్ల మందికి ప్రాడక్ట్ ప్రజలకు దగ్గరవుతుంది. అందుకే కంపెనీలు కూడా మ్యాచ్ సమయంలో ప్రకటనలు ఇచ్చేందుకు పోటీపడుతున్నాయ్.

భారత్‌, పాకిస్తాన్‌ మ్యాచ్‌ను…ప్రసార హక్కుల కలిగిన స్టార్‌ ఇండియా…క్యాష్‌ చేసుకుంటోంది. యాడ్ ఇస్తే వసూలు చేసే మొత్తాన్ని దాదాపు 50 శాతం పెంచేసింది. ఇండియా-పాక్ మ్యాచ్‌లో 5,500 సెకన్ల యాడ్స్‌తో ఏకంగా రూ.100 కోట్లకుపైగా ఆదాయం పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. పది సెకన్ల యాడ్‌కు రూ.25 లక్షలు తీసుకుంటోంది. సాధారణంగా భారత్ ఇతర మ్యాచులకు…ఇప్పటి వరకు పది సెకన్ల యాడ్‌కు 16 నుంచి రూ.18 లక్షలు వసూలు చేస్తోంది. యాడ్స్‌ ద్వారానే భారీగా డబ్బు రాబట్టుకునేందకు రెడీ అయింది స్టార్‌ యాజమాన్యం. అందులో భాగంగానే…యాడ్‌ రేట్లను ఊహించని విధంగా పెంచేసింది.

అయితే స్టార్‌ ఇండియా టార్గెట్‌పై వరణుడు ఎలాంటి ప్రభావం చూపుతాడో అర్థం కావడం లేదు. ఆదివారం వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని…వాతవరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వర్షం పడేందుకు దాదాపు 60 శాతం అవకాశముందని అంటున్నారు

మరోవైపు పాకిస్తాన్‌ క్రికెటర్లకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు పీసీబీ ఛైర్మన్‌ రమీజ్‌ రాజా. టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టును మట్టి కరిపించగలిగితే ఓ బ్లాంక్ చెక్‌ను ఈనామ్‌గా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. భారత్‌పై తమ జట్టు విజయం సాధిస్తే… గిఫ్ట్‌గా బ్లాంక్ చెక్ ఇస్తానని, దాని మీద ఎంత మొత్తమైనా రాసుకోవచ్చని ఓ బడా పారిశ్రామికవేత్త ఆఫర్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ బ్లాంక్ చెక్‌ ఆఫర్ ఇచ్చిన ఆ పెట్టబడిదారుడి పేరును వెల్లడించడానికి ఆయన ఇష్టపడలేదు. దాని గురించి మాట్లాడుకోవడం ఇప్పుడు అప్రస్తుతమని స్పష్టం చేశారు. అక్టోబర్ 24వ తేదీన భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ తరువాత.. అన్ని వివరాలు వెల్లడవుతాయని చెప్పారు. బాబర్ ఆజమ్ సారథ్యంలోని తమ టీమ్ బ్యాటింగ్, బౌలింగ్‌లల్లో పకడ్బందీగా ఉందని, ఎలాంటి ప్రత్యర్థినయినా ఓడించగలుగుతుందని అన్నారు.