NTV Telugu Site icon

Mohammed Siraj : పద్దతి మార్చుకో సిరాజ్..

Siraj

Siraj

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో ఆర్సీబీ బౌలర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్ లో మంచి ప్రదర్శనప్పటికీ తన ప్రవర్తనతో విలన్ రోల్ కూడా పోషిస్తున్నాడు.లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి, గంభీర్‌ గొడవకు మూలకారకుడు సిరాజే అన్న సంగతి అందరికి తెలుసు.. ఆ గొడవ సద్దుమణుగకముందే సిరాజ్‌ మరోసారి ఆవేశానికి లోనయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిరాజ్‌.. ఫిల్‌ సాల్ట్‌తో గొడవకు దిగాడు. మధ్యలో వచ్చిన డేవిడ్ వార్నర్‌ను కూడా తిట్టడం ఇక్కడ ఆసక్తి రేపింది. వీరి మధ్య మాట్లాడుకున్నా మాటలను బట్టి చూస్తే కాస్త గట్టిగానే తిట్టుకున్నట్లు అర్థమవుతుంది.

Also Read : RCB vs DC: ఆర్సీబీని చిత్తుచిత్తుగా ఓడించిన ఢిల్లీ క్యాపిటల్స్

విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌ సిరాజ్‌ బౌలింగ్ వేశాడు. అప్పటికే తొలి మూడు బంతులను సాల్ట్‌ రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌ కొట్టాడు. నాలుగో బంతిని షార్ట్‌బాల్‌ వేయగా ఆన్‌ ది లైన్‌ దాటుకుంటూ వెళ్లింది. కానీ ఫీల్డ్‌ అంపైర్‌ వైడ్‌ ఇవ్వకపోవడంతో సాల్ట్‌ లెగ్‌ అంపైర్‌వైపు తిరిగాడు. లెగ్‌ అంపైర్‌ ఫస్ట్ ఏం చెప్పలేదు.. అయితే బాల్ చెక్ చేసిన తర్వాత దాన్ని వైడ్ బాల్ గా ప్రకటించాడు. దీంతో సాల్ట్.. సిరాజ్ వైపు తిరిగి ఏదో తిట్టినట్లు కనిపించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్ సాల్ట్ మీదకు ఆవేశంగా దూసుకుపోయాడు. ఈలోగా ఢిల్లీ కెప్టెన్‌ వార్నర్‌ తలదూర్చగా.. సిరాజ్‌ తన పెదవులపై వేలు పెట్టి సైలెంట్ అన్నట్లు సాల్ట్ ను చూస్తూ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో సాల్ట్‌ బౌలింగ్‌ వేయడానికి వెళ్లు అని అరిచాడు. అంపైర్‌, ఆర్‌సీబీ కెప్టెన్‌ డుప్లెసిస్‌ వచ్చి సిరాజ్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది.

Also Read : Kanti Velugu : కంటి వెలుగులో 1.34 కోట్ల మందికి పైగా పరీక్షలు

దీంతో సిరాజ్‌తో గొడవను పర్సనల్‌గా తీసుకున్న ఫిల్‌ సాల్ట్‌ ఆర్‌సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తొలిసారి తన బ్యాటింగ్‌ పవరేంటో చూపించాడు. సాల్ట్‌ 45 బంతుల్లో 87 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌ 8 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. అతని ధాటికి ఢిల్లీ క్యాపిటల్స్‌ 182 పరుగుల టార్గెట్‌ను 16.4 ఓవర్లలోనే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. కాగా వీడియో చూసిన ఫ్యాన్స్.. సిరాజ్‌ను తప్పుబట్టారు. సిరాజ్‌ ఇది మంచి పద్దతి కాదు.. నీ వైఖరి మార్చుకో.. గొడవపడ్డావు.. ఏం లాభం.. అక్కడ సాల్ట్‌ పూనకం వచ్చినట్లు చెలరేగాడు.. అంతా నీవల్లే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.