Dhoni Record Breaks: కామన్వెల్త్ గేమ్స్‌లో టీమిండియా మహిళల జట్టు అదరగొట్టింది. తొలి మ్యాచ్‌లో బలమైన ఆస్ట్రేలియా జట్టుపై ఓటమి ఎదురైనా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆదివారం దాయాది పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఉమెన్ ఇన్ బ్లూ తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్ రికార్డు సృష్టించింది. దీంతో ఏకంగా టీమిండియా సక్సెస్‌ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డు బద్దలైంది.
Read Also: భారతీయులు నమోదు చేసిన 10 వింత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్
వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం నాడు పాకిస్థాన్‌పై టీమిండియా మహిళా క్రికెట్ టీమ్ విజయం సాధించడంతో టీ20 క్రికెట్‌లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ రికార్డు సృష్టించింది. తద్వారా ధోనీ(41) పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టింది. హర్మన్ ప్రీత్‌కౌర్ కెప్టెన్‌గా టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు 42 విజయాలు సాధించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో పాక్‌పై విజయంతో ఈ ఘనత సాధించింది. కాగా ఈ జాబితాలో కోహ్లీ(30 గెలుపులు), రోహిత్(27 విజయాలు) మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. కాగా మహిళల క్రికెట్‌ను కామన్వెల్త్ గేమ్స్ జాబితాలో చేర్చడం ఇదే తొలిసారి. 1998 కౌలాలంపూర్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల క్రికెట్ తర్వాత రెండోసారి మాత్రమే ఈ ఈవెంట్‌లో క్రికెట్‌ను చేర్చారు.