Site icon NTV Telugu

Team India: రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ

Hardik Pandya

Hardik Pandya

Team India: టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా బిజీ బిజీగా గడపనుంది. ఈ మేరకు న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటించనుంది. అక్కడ వన్డేలు, టీ20లు ఆడనుంది. అయితే ఈ రెండు సిరీస్‌ల నుంచి స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీకి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అయితే ఆశ్చర్యకరంగా న్యూజిలాండ్ పర్యటన తర్వాత సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో ఆడనున్న టెస్టులు, వన్డేలకు మాత్రం స్టార్ ఆటగాళ్లను సెలక్టర్లు ఎంపిక చేశారు. నవంబర్ 18 నుంచి న్యూజిలాండ్‌తో మూడు టీ20లను టీమిండియా ఆడనుంది. ఈ సిరీస్‌కు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అనంతరం మూడు వన్డేల సిరీస్‌లో మాత్రం శిఖర్ ధావన్ పగ్గాలను అందుకోనున్నాడు. టీ20, వన్డే సిరీస్‌లకు రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

న్యూజిలాండ్‌తో తలపడే టీ20 జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, చాహల్, కుల్‌దీప్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్, ఉమ్రాన్ మాలిక్

న్యూజిలాండ్‌తో తలపడే వన్డే జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, చాహల్, కుల్‌దీప్, అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్

బంగ్లాదేశ్‌తో తలపడే టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్

బంగ్లాదేశ్‌తో తలపడే వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రాజ్‌దత్ పటీదార్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, యష్ దయాల్

Exit mobile version