Hardik Pandya Trade: చెన్నై, కోల్‌కతా కాదు.. హార్దిక్ ఆ జట్టులోకే వెళ్తాడు.. ఏ తప్పేముంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya return to Gujarat Titans in IPL 2027: ఐపీఎల్ 2027లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఏ జట్టు తరఫున ఆడతాడనే చర్చ రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కారణంగా.. హార్దిక్ జట్టును వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లు అతడిని తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరిగింది. భారత మాజీ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం హార్దిక్ మరో జట్టులోకి వెళ్లొచ్చని అంచనా వేశాడు.
హార్దిక్ పాండ్యా మాజీ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్‌ను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. ముంబై ఇండియన్స్ నుంచి తిరిగి గుజరాత్‌కు రావాలనే ఆసక్తి హార్దిక్ వ్యక్తం చేసినప్పటికీ.. కెప్టెన్సీ విషయంలో అతడు పెట్టిన షరతే డీల్‌కు అడ్డంకిగా మారిందని సమాచారం. అయితే కెప్టెన్సీ లేకపోయినా హార్దిక్ మళ్లీ టైటాన్స్‌కు వెళ్లే అవకాశం ఉందని ఆర్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. యాష్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. ‘గుజరాత్ టైటాన్స్‌ను హార్దిక్ సంప్రదించడం తప్పేమీ కాదు. టైటాన్స్‌లో అతడికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. బ్యాటింగ్, కెప్టెన్సీ పరంగా అతడి కెరీర్లో అత్యుత్తమ దశ గుజరాత్ జట్టులోనే వచ్చింది. నాకు ఇప్పటికీ ఓ బలమైన నమ్మకం ఉంది.. హార్దిక్ మళ్లీ గుజరాత్ టైటాన్స్‌కు వెళ్లొచ్చు’ అని అన్నాడు.
Also Read
- Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
- Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
- Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
- PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
2022 ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ అరంగేట్రం చేసింది. 2022, 2023 సీజన్లలో హార్దిక్ జట్టుకు నాయకత్వం వహించాడు. తొలి సీజన్లోనే టైటిల్ అందించడంతో పాటు.. 2023లో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌కు తిరిగి వెళ్లిన హార్దిక్.. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినా ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయాడు. అందుకే టైటాన్స్‌కు తిరిగి వెళ్లడం హార్దిక్‌కు మళ్లీ కలిసిరావొచ్చని ఆర్ అశ్విన్ జోస్యం చెప్పాడు. అక్కడి వికెట్లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటం, తనకు అనుకూలమైన పరిసరాలు ఉండటం కూడా హార్దిక్‌కు ప్లస్ పాయింట్లని పేర్కొన్నాడు.
గుజరాత్ టైటాన్స్‌కు హార్దిక్ తిరిగి వస్తే కెప్టెన్సీ మాత్రం దక్కకపోవచ్చని అశ్విన్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడని, గత రెండు సీజన్లలో అతడి నాయకత్వం బాగుందని చెప్పాడు. ‘గుజరాత్ టైటాన్స్‌కు హార్దిక్ తిరిగి వెళ్తే అది అతడికి లక్ మరలా కలిసిరానుంది. కానీ కెప్టెన్సీ మాత్రం లభించదని అనుకుంటున్నాను. శుభ్‌మన్ గిల్ గత రెండేళ్లుగా అద్భుతంగా నాయకత్వం వహిస్తున్నాడు. అయినప్పటికీ అవకాశం వస్తే హార్దిక్ మళ్లీ గుజరాత్‌కు వెళ్లడాన్ని పరిగణించాలి. ఇది జరిగే అవకాశం ఉందని నాకు అనిపిస్తోంది’ అని అశ్విన్ చెప్పాడు.
ముంబై ఇండియన్స్‌లో విజయవంతం కాకపోయినా.. గుజరాత్ టైటాన్స్‌కు తిరిగి వెళ్లి మరోసారి తన సత్తా నిరూపించుకోవాలని హార్దిక్ చూస్తాడని అశ్విన్ పేర్కొన్నాడు. ముంబైతో ఈసారి టైటిల్ గెలవలేకపోయినా.. గుజరాత్‌తో మళ్లీ విజయం సాధించి తనను తాను నిరూపించుకోవాలనే పట్టుదల హార్దిక్‌లో ఉండొచ్చని చెప్పాడు. అయితే హార్దిక్ భవిష్యత్తుపై ఇప్పటివరకు అతడి నుంచి కానీ, ముంబై ఇండియన్స్ నుంచి కానీ అధికారిక ప్రకటన రాలేదు. ఐపీఎల్ 2026 తర్వాత ఓ భారీ ట్రేడ్ చోటుచేసుకుంది. రిషభ్ పంత్ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లగా.. కుల్దీప్ యాదవ్ లక్నో సూపర్ జెయింట్స్‌కు చేరాడు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా తదుపరి గమ్యం కూడా ఖరారైతే.. ఐపీఎల్ ట్రేడింగ్‌లో మరో సంచలన అధ్యాయం కానుంది.
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!