NTV Telugu Site icon

Hardik Pandya: హార్దిక్ పాండ్యా ఔటా..? నాటౌటా?

Hardik Pandya

Hardik Pandya

Hardik Pandya: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో థర్డ్ అంపైర్ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఔట్ విషయంలో అంపైర్ చేసిన తప్పిదం చర్చనీయాంశమైంది. దీంతో పాండ్యా అసలు ఔటా లేక నాటౌటా అని నెట్టింట ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Read Also: Rashmika: ఏం పాప.. రిషబ్ కు భయపడినవా ఏంటి.. ఓ మోసేస్తున్నావ్

డారిల్‌ మిచెల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 40వ ఓవర్‌లో నాలుగో బంతిని పాండ్యా ఫ్లిక్‌ చేయబోగా అది మిస్ అయ్యి కీపర్‌ టామ్‌ లాథమ్‌ చేతుల్లో పడింది. వెంటనే బెయిల్స్‌ కూడా కిందపడ్డాయి. పాండ్యా ఔట్‌ విషయంలో క్లారిటీ లేనందున ఫీల్డ్‌ అంపైర్‌ థర్డ్‌ అంపైర్‌ను రివ్యూ కోరాడు. రిప్లేలో కూడా బంతి నేరుగా వికెట్లను తాకినట్లు కనపడలేదు. కానీ లాథమ్‌ గ్లోవ్స్‌ వికెట్లను తాకినట్లు కనిపించింది. దీంతో లాథమ్‌ బంతి అందుకోకముందే బెయిల్స్‌ పడిపోయినట్లు పరిగణించిన థర్డ్‌ అంపైర్‌ పాండ్యాను బౌల్డ్‌గా ప్రకటించాడు. దీంతో పాండ్యా ఖంగుతున్నాడు. నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 50 ఓవర్లలో 349/8 భారీ స్కోర్ చేసింది. శుభ్‌మన్ గిల్ (149 బంతుల్లో 208) డబుల్ సెంచరీతో మెరిశాడు.