Hardik Pandya-Fan: 1000 కిలోమీటర్లకు పైగా నడిచాడు.. హార్దిక్ మనసు గెలిచాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fan Walks Over 1000km To Meet Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై ఓ ఫ్యాన్ చూపించిన అభిమానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన అభిమాన క్రికెటర్‌ను కలవాలనే కోరికతో ఓ అభిమాని ఏకంగా 1,000 కిలోమీటర్లకు పైగా కాలినడకన ప్రయాణించి బెంగళూరుకు చేరుకున్నాడు. లక్నోకు చెందిన రవి.. ముంబై నుంచి బెంగళూరులోని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) వరకు నడుచుకుంటూ వెళ్లాడు. హార్దిక్‌ను కలిసిన అతడికి ఊహించని ఆతిథ్యం లభించింది.
ప్రస్తుతం గాయం నుంచి కోలుకునేందుకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో హార్దిక్ పాండ్యా పునరావాసం పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న రవి.. ముంబై నుంచి కాలినడకన బయల్దేరి బెంగళూరులోని సీఓఈకి చేరుకున్నాడు. అభిమాని వచ్చాడని తెలుసుకున్న హార్దిక్ ఆప్యాయంగా పలకరించాడు. రవితో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. అంతేకాదు తిరిగి వెళ్లేందుకు రైలు టికెట్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో హార్దిక్.. అభిమానిని ఉద్దేశించి ‘నీకు ఏమైనా కావాలా? నీ కోసం నేను ఏమైనా చేయగలనా?’ అని అడిగాడు. త్వరలోనే మళ్లీ కలుస్తా అని చేతిలో ప్లకార్డు పట్టుకుని వచ్చిన రవితో హార్దిక్ చెప్పినట్లు వీడియోలో వినిపిస్తోంది.
Also Read
- Sanju Samson: రజనీకాంత్‌పై అభిమానం నెక్స్ట్ లెవల్.. ‘జైలర్ 2’ కోసం థియేటర్ మొత్తం బుక్ చేసిన సంజు శాంసన్!
- Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
- India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
- WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
హార్దిక్ పాండ్యా ప్రస్తుతం గాయం కారణంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. గత మేలో 2026 ఐపీఎల్ సందర్భంగా గాయపడిన అతడు అప్పటి నుంచి పూర్తిస్థాయిలో మైదానంలోకి తిరిగి రాలేదు. బౌలింగ్ చేస్తున్నప్పుడు ఇంకా నొప్పి వేధిస్తుండటంతో అతడి పునరాగమనం ఆలస్యమవుతోంది. తాజాగా మరోసారి గాయం తిరగబెట్టడం కూడా అతడి ఫిట్‌నెస్‌పై ప్రభావం చూపింది. న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక కాలేదు. ఈ పర్యటనలో భారత్ ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. ఫిట్నెస్ నిరూపించుకుంటే జింబాబ్వేతో జరిగే వన్డే సిరీస్‌లో ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది. లేదంటే విజయ్ హజారే ట్రోఫీ లేదా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా పోటీ క్రికెట్లోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది.
A fan walked all the way from Mumbai to Bengaluru just to meet Hardik Pandya, and Hardik not only met him warmly but also arranged his return ticket @hardikpandya7 ❤️ https://t.co/cx62NNHpaE
— Rohan Gangta (@rohangangta) October 19, 2026
తాజావార్తలు
-
AB Venkateswara Rao: వంగవీటి రాధాపై ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది రాజకీయ పోరాటమే!
-
Hardik Pandya-Fan: 1000 కిలోమీటర్లకు పైగా నడిచాడు.. హార్దిక్ మనసు గెలిచాడు!
-
AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు
-
Drinking Water Alert: పండగ వేళ హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం!
-
EMI: అప్పు చేసి చిప్ప కూడు..! చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా పండుగల వేళ కొంతమంది హెచ్చులు!
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!