Fan Walks Over 1000km To Meet Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై ఓ ఫ్యాన్ చూపించిన అభిమానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన అభిమాన క్రికెటర్‌ను కలవాలనే కోరికతో ఏకంగా 1,000 కిలోమీటర్లకు పైగా కాలినడకన ప్రయాణించి బెంగళూరుకు చేరుకున్నాడు. లక్నోకు చెందిన రవి.. ముంబై నుంచి బెంగళూరులోని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) వరకు నడుచుకుంటూ వెళ్లాడు. హార్దిక్‌ను కలిసిన అతడికి ఊహించని ఆతిథ్యం లభించింది.
ప్రస్తుతం గాయం నుంచి కోలుకునేందుకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో హార్దిక్ పాండ్యా పునరావాసం పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న రవి.. ముంబై నుంచి కాలినడకన బయల్దేరి బెంగళూరులోని సీఓఈకి చేరుకున్నాడు. అభిమాని వచ్చాడని తెలుసుకున్న హార్దిక్ ఆప్యాయంగా పలకరించాడు. రవితో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. అంతేకాదు తిరిగి వెళ్లేందుకు రైలు టికెట్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో హార్దిక్.. అభిమానిని ఉద్దేశించి ‘నీకు ఏమైనా కావాలా? నీ కోసం నేను ఏమైనా చేయగలనా?’ అని అడిగాడు. త్వరలోనే మళ్లీ కలుస్తా అని చేతిలో ప్లకార్డు పట్టుకుని వచ్చిన రవితో హార్దిక్ చెప్పినట్లు వీడియోలో వినిపిస్తోంది.
హార్దిక్ పాండ్యా ప్రస్తుతం గాయం కారణంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. గత మేలో 2026 ఐపీఎల్ సందర్భంగా గాయపడిన అతడు అప్పటి నుంచి పూర్తిస్థాయిలో మైదానంలోకి తిరిగి రాలేదు. బౌలింగ్ చేస్తున్నప్పుడు ఇంకా నొప్పి వేధిస్తుండటంతో అతడి పునరాగమనం ఆలస్యమవుతోంది. తాజాగా మరోసారి గాయం తిరగబెట్టడం కూడా అతడి ఫిట్‌నెస్‌పై ప్రభావం చూపింది. న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక కాలేదు. ఈ పర్యటనలో భారత్ ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. ఫిట్‌నెస్ నిరూపించుకుంటే జింబాబ్వేతో జరిగే వన్డే సిరీస్‌లో ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది. లేదంటే విజయ్ హజారే ట్రోఫీ లేదా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా పోటీ క్రికెట్‌లోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది.
A fan walked all the way from Mumbai to Bengaluru just to meet Hardik Pandya, and Hardik not only met him warmly but also arranged his return ticket @hardikpandya7 ❤️ https://t.co/cx62NNHpaE
— Rohan Gangta (@rohangangta) October 19, 2026

