Hardik Pandya: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన ప్రవర్తనతో వివాదంలో నిలిచాడు. శ్రీలంక ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో 11వ ఓవర్ పూర్తయిన తర్వాత వాటర్ బాయ్‌గా వాషింగ్టన్ సుందర్ మైదానంలోకి వచ్చాడు. అయితే తనకు వాటర్ ఇవ్వలేదని 12వ ఆటగాడైన వాషింగ్టన్ సుందర్‌పై పాండ్యా నోరుపారేసుకున్నాడు. నీళ్లు ఇవ్వకుండా ఎవడి ** *****? అంటూ హిందీ భాషలో బూతులతో రెచ్చిపోయాడు. పాండ్యా కామెంట్స్ స్టంప్ మైక్‌లో రికార్డు అవ్వడంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో హార్దిక్ పాండ్యా ఉపయోగించిన పదజాలంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సహచర ఆటగాడిపై కనీస గౌరవం లేకుంటే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు.
Read Also: Payal Rajput: టవల్ చుట్టుకుని సెల్ఫీ ఏంటమ్మా.. పొట్టి నిక్కర్‌తో..
అటు వాటర్ ఇవ్వకపోతే అంత పెద్ద బూతు వాడాలా అని కొందరు నెటిజన్‌లు పాండ్యాను ఏకిపారేస్తున్నారు. టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్సీ, వన్డేల్లో వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ రావడంతో బలుపు ఎక్కువైందని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడని మండిపడుతున్నారు. ఇటీవల శ్రీలంకతో టీ20 సిరీస్‌లోనూ ఇలానే వ్యవహరించాడని గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా హార్దిక్ పాండ్యా తన ప్రవర్తనను మార్చుకోవాలని మాజీ క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు హితవు పలుకుతున్నారు.