Site icon NTV Telugu

మళ్లీ హైదరాబాద్‌కు ఆడనున్న విహారి…

టీమిండియా టెస్టు ఆటగాడు హనుమ విహారి… మళ్లీ హైదరాబాద్‌ జట్టు తరపున రంజీల్లో ఆడనున్నాడు. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ జారీ చేయడంతో…హెచ్‌సీఏకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. తొలుత హైదరాబాద్‌ తరఫున రంజీ పోటీల్లో పాల్గొన్న విహారి.. ఇక్కడ ఉన్న కొన్ని సమస్యల కారణంగా… ఆంధ్రాకు తరలి వెళ్లాడు. ఇంగ్లండ్‌ టెస్ట్‌ సిరీస్‌ పర్యటనకు ఎంపికైన విహారి.. కేవలం రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమ్యాడు. కరోనా కారణంగా ఇంగ్లండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టు అర్ధంతరంగా రద్దు కావడంతో… ఆటగాళ్లు అందరూ ఐపీఎల్ కోసం యూఏఈకి వెళ్లగా… విహారి స్వదేశానికి చేరుకున్నాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ కోసం జరిగిన వేలంలో విహారిని ఏ జట్టు కొనుగోలు చేయలేదు అనే విషయం తెలిసిందే.

Exit mobile version