Site icon NTV Telugu

IPl 2022 : ముగిసిన గుజరాత్‌ బ్యాటింగ్‌.. కోల్‌కతా టార్గెట్‌ 157..

Kkr Vs Gt

Kkr Vs Gt

ఐపీఎల్‌ సీజన్‌ 2022లో జట్లు మధ్య పోటీ గట్టిగానే ఉంది. రోజురోజుకు మ్యాచ్‌లలో ఉత్కంఠ పెరిగిపోతోంది. అయితే నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు ముంబాయి డీవై పాటిల్‌ స్టేడియ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన గుజరాత్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంకుని బరిలోకి దిగగా ఆదిలోని షాక్‌ తగిలింది. సౌథీ బౌలింగ్‌లో సామ్‌ బిల్లింగ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి శుభ్‌మన్‌ గిల్‌ (5 బంతుల్లో 7; ఫోర్‌) ఔటయ్యాడు.

రెండో ఓవర్‌లోనే గిల్‌ వికెట్‌ పడటంతో గుజరాత్‌ టైటాన్స్‌ ఆచితూచి ఆడింది. అయితే సాహా రూపంలో రెండో వికెట్‌ను గుజరాత్‌ కోల్పోయింది. ఆ తరువాత భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో డేవిడ్‌ మిల్లర్‌ ఔట్ అయ్యి పెవిలియన్‌ చేరాడు. అంతేకాకుండా 18వ ఓవర్‌లో గుజరాత్‌ జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్‌ జట్టు 156/59 పరుగులు సాధించింది.

Exit mobile version