Site icon NTV Telugu

IPL 2022: చావో.. రేవో.. ఆర్సీబీ ముందు టార్గెట్ ఎంతంటే..?

Gujarath Titans

Gujarath Titans

ముంబైలోని వాంఖడే స్టేడియంలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 5 కోల్పోయి 168 పరుగులు చేసింది. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (62) అర్ధసెంచరీతో రాణించాడు. శుభమన్‌గిల్(1), సాహా (31), వేడ్ (16), డేవిడ్ మిల్లర్ (34), తెవాటియా (2), రషీద్ ‌ఖాన్ (19) పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో హేజిల్‌వుడ్ 2 వికెట్లు సాధించగా.. మాక్స్‌వెల్, హసరంగ తలో వికెట్ తీశారు.

IPL 2022: అరగంట ఆలస్యంగా ఫైనల్ మ్యాచ్.. ఎందుకంటే..?

కాగా ఈ సీజన్‌లో పాయింట్ల టేబుల్‌లో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్‌ టైటాన్స్‌, ఐదో స్థానంలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు లీగ్‌స్టేజ్‌లో ఇదే చివరి మ్యాచ్‌. ఇప్పటికే 10 మ్యాచులు గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు 20 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా ఆ జట్టుకు పోయేదేం లేదు. ఆర్సీబీకి మాత్రం ఇచ్చి కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌. వారి ఖాతాలో 14 పాయింట్లు ఉన్నప్పటికీ నెగిటివ్‌ రన్‌రేట్‌ ప్లేఆఫ్స్‌ ఆశలకు అడ్డంకిగా మారింది. దీంతో గుజరాత్‌పై బెంగళూరు మామూలుగా గెలిస్తే చాలదు. రన్‌రేట్‌ పాజిటివ్‌కు రావాలి. అటు నాలుగో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఓడిపోవాలని ఆర్సీబీ అభిమానులు ప్రార్థించాలి.

Exit mobile version