NTV Telugu Site icon

RR vs GT: రాజస్థాన్ రాయల్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం

Gujarat Titans Won

Gujarat Titans Won

RR vs GT: జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం సాధించింది. ఆ జట్టు నిర్దేశించిన 119 పరుగుల లక్ష్యాన్ని 13.5 ఓవర్లలోనే 9 వికెట్ల తేడాతో ఛేధించింది. వృద్ధిమాన్ సాహా (41), శుబ్మన్ గిల్ (36), హార్దిక్ పాండ్యా (39) కలిసి ఆ స్వల్ప లక్ష్యాన్ని చేధించేశారు. గుజరాత్ బౌలర్ల తరహాలో రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయలేకపోయారు. బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. ఒక్క చాహల్ మాత్రమే ఒక వికెట్ పడగొడితే, మిగతా వాళ్లెవ్వరూ వికెట్లు తీయలేకపోయారు.

Minister KTR : ఎన్నికలొస్తే సంక్రాంతి గంగిరెద్దుల్లా బీజేపీ, కాంగ్రెస్ నేతలు వస్తారు

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు.. 17.5 ఓవర్లలోనే 118 పరుగులకి ఆలౌట్ అయ్యింది. సంజూ ఒక్కడే 30 పరుగులతో హయ్యస్ట్ స్కోరర్‌గా నిలిచారు. మిగతా బ్యాటర్లందరూ ఘోరంగా విఫలమయ్యారు. గుజరాట్ టైటాన్స్ బౌలర్ల ధాటికి ఏ ఒక్కరూ ఎక్కువసేపు నిలకడగా రాణించలేకపోయారు. బట్లర్, షిమ్రాన్, జురేల్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు సైతం ఈసారి చేతులు ఎత్తేశారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన రియాన్ పరాగ్.. ఎలాంటి ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. ఇక 119 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు.. 13.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 119 పరుగులు చేసి గెలుపొందింది. లక్ష్యం చిన్నదే అయినప్పటికీ.. గుజరాత్ బ్యాటర్లు మైదానంలో అడుగుపెట్టినప్పటి నుంచే దూకుడుగా ఆడటం మొదలుపెట్టారు. పవర్ ప్లేలో వీలైనంత ఎక్కువ పరుగులు చేసేందుకు ప్రయత్నించారు.

Populated Cities: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా గల టాప్-10 నగరాలు

ఓపెనర్లుగా వచ్చిన శుబ్మన్, సాహా ఆటతీరు చూసి.. వీళ్లిద్దరే లక్ష్యాన్ని ఛేధిస్తారని అంతా అనుకున్నారు. అయితే.. పదో ఓవర్‌లో ఓ భారీ షాట్ ఆడేందుకు శుబ్మన్ ఫ్రంట్‌ఫుట్ రాగా.. బంతి మిస్సై కీపర్ చేతుల్లోకి వెళ్లింది. అలా అతడు స్టంప్ ఔట్ అయ్యాడు. అతని తర్వాత వచ్చిన హార్దిక్.. రావడం రావడంతోనే విజృంభించాడు. ఆడం జంపా బౌలింగ్‌లో మూడు సిక్సులు, ఒక ఫోర్ కొట్టాడు. ఇక చివరగా సాహా విన్నింగ్ రన్ తీసి.. జట్టుని గెలిపించాడు. మూడు వికెట్లతో చెలరేగడంతో.. రషీద్ ఖాన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ గెలిచాడు.

Show comments