Site icon NTV Telugu

MI vs GT: గుజరాత్ ‘శుభ్’ఆరంభం.. 10 ఓవర్లలో స్కోరు ఇది!

Gt 10 Overs Score

Gt 10 Overs Score

Gujarat Titans Scored 91 Runs In First 10 Overs: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జట్టు అద్భుతంగా రాణిస్తోంది. ఓపెనర్ శుబ్మన్ గిల్ పుణ్యమా అని జీటీ స్కోరు బుల్లెట్ ట్రెయిన్‌లో పరుగులు పెడుతోంది. తొలి 10 ఓవర్లు ముగిసే సమయానికి.. గుజరాత్ టైటాన్స్ ఒక వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది. ఇప్పటికే అర్థశతకం పూర్తి చేసుకున్న గిల్.. శతకం దిశగా దూసుకెళ్తున్నాడు. ముంబై బౌలర్లతో అతగాడు చెడుగుడు ఆడేసుకుంటున్నాడు.

RK Roja: దిగజారుడు మాటలు మాట్లాడిన టీడీపీని.. సెంటు భూమిలో పాతిపెట్టాలి

తొలుత గుజరాత్ ఓపెనర్లు నిదానంగానే తమ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో.. ఆచితూచి ఆడారు. ఆ తర్వాత క్రమంగా రెచ్చిపోయారు. ఒక్కొక్కటిగా బౌండరీలు బాదడం మొదలుపెట్టారు. నిజానికి.. ఆరో ఓవర్‌లోనే గిల్ ఔట్ అవ్వా్ల్సింది. జోర్డాన్ బౌలింగ్‌లో అతడు టిమ్ డేవిడ్‌కి క్యాచ్ ఇచ్చాడు. కానీ.. డేవిడ్ దాన్ని వదిలేశాడు. ఇలా తనకొచ్చిన లైఫ్‌ని గిల్ సద్వినియోగం చేసుకున్నాడు. అప్పటి నుంచి చెలరేగి ఆడుతున్నాడు. ఎడాపెడా షాట్లతో బౌండరీల మోత మోగించేస్తున్నాడు. అటు సాహా కూడా దుమ్మురేపాలని ప్రయత్నించాడు కానీ, ఇంతలోనే స్టంప్ ఔట్ అయ్యాడు.

సాహా ఔట్ అయ్యాక వచ్చిన సుదర్శన్ క్రీజులో కుదురుకోవడానికి కొంత సమయం తీసుకొని, ఆ తర్వాత ఖాతా తెరవడం మొదలుపెట్టాడు. మరోవైపు.. తన అర్థశతకం పూర్తవ్వడంతో, గిల్ విజృంభిస్తున్నాడు. తన జట్టుకి భారీ స్కోరు అందించడానికి తనవంతు సహకారం అందిస్తున్నాడు. ఒకవేళ ఇదే జోరుని జీటీ జట్టు కొనసాగిస్తే.. ముంబై ముందు భారీ లక్ష్యం నిర్దేశించవచ్చు. ఎంతైనా ఇది ప్రతిష్టాత్మకమైన మ్యాచ్ కద్దా.. ఈమాత్రం హల్‌చల్ ఉండాల్సిందే. చూద్దాం.. జీటీ ఎంత మేర టార్గెట్‌ని ముంబైకి ఇస్తుందో?

Exit mobile version