Site icon NTV Telugu

Greatest T20 Cricketer: ఏకంగా ఏడు సార్లు.. విరాట్ కోహ్లీ ఆధిపత్యం మాములుగా లేదుగా!

Greatest T20 Cricketer Kohli

Greatest T20 Cricketer Kohli

భారత క్రికెట్‌కు టీ20 ఫార్మాట్‌లో మంచి గుర్తింపు ఉంది. ప్లేయర్స్ స్థిరమైన బ్యాటింగే ఇందుకు ప్రధాన కారణం. ప్రతి ఏడాది ఓ బ్యాటర్ పరుగుల వరద పారించి.. టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ప్రతి క్యాలెండర్ ఇయర్‌లో ఓ బ్యాటర్ నంబర్‌–1గా నిలిచాడు. 2010 నుంచి ప్రతి క్యాలెండర్ ఇయర్ ముగిసే సరికి భారత్ తరఫున నంబర్‌–1 టీ20 బ్యాటర్‌గా నిలిచిన ఆటగాళ్ల జాబితా అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. ఈ లిస్ట్ చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది.. భారత టీ20 బ్యాటింగ్‌ను టీమిండియా మాజీ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆధిపత్యం చాలా ఏళ్లు కొనసాగింది.

2010 సంవత్సరంలో యువరాజ్ సింగ్ టీ20 ఫార్మాట్‌లో భారత్ నంబర్‌–1 బ్యాటర్‌గా నిలిచి.. తన ఆల్‌రౌండ్ ప్రతిభను చాటాడు. ఆ తర్వాత 2011లో మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా ఈ స్థానం దక్కించుకొని.. టీ20లో తన స్థిరత్వాన్ని నిరూపించాడు. అసలైన ఆధిపత్యం మొదలైంది 2012 నుంచి. విరాట్ కోహ్లీ 2012 నుంచి 2017 వరకు వరుసగా ఆరు సంవత్సరాలు భారత్ నంబర్‌–1 టీ20 బ్యాటర్‌గా కొనసాగి.. పొట్టి ఫార్మాట్‌లో తన ఆధిపత్యంను కొనసాగించాడు. మళ్లీ 2020లోనూ కింగ్ ఈ స్థానం దక్కించుకోవడం విశేషం.

Also Read: Paul Stirling History: రోహిత్ శర్మ రికార్డు బద్దలు.. టీ20 చరిత్రలో పాల్ స్టిర్లింగ్ సరికొత్త చరిత్ర!

2018, 2019, 2021 సంవత్సరాల్లో కేఎల్ రాహుల్ టీ20 బ్యాటింగ్‌లో భారత్ తరఫున నంబర్‌–1గా నిలిచాడు. ఓపెనర్‌గా, మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా అతని స్థిరత్వం అతడిని నంబర్‌–1గా నిలిపింది. ఆ తర్వాత టీ20 ఆటను మార్చిన ఆటగాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. 2022, 2023 సంవత్సరాల్లో అతడు భారత్ నంబర్‌–1 టీ20 బ్యాటర్‌గా నిలిచి.. తన వినూత్న షాట్లతో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచాడు. 2024లో యువ బ్యాటర్ తిలక్ వర్మ, 2025లో అభిషేక్ శర్మ భారత్ నంబర్‌–1 టీ20 బ్యాటర్‌లుగా నిలిచి కొత్త చరిత్ర సృష్టించారు. ఈ గణాంకాలు చూస్తే.. భారత టీ20 క్రికెట్ ఎంత బలంగా ఉందో అర్ధమవుతుంది. మొత్తంగా చూస్తే.. ప్రతి తరం భారత టీ20 బ్యాటింగ్‌కు ఓ కొత్త స్టార్‌ను అందించింది.

Exit mobile version