Gautam Gambhir: అబ్బబ్బా ఏం షాట్ అది.. బిత్తరపోయిన గౌతమ్ గంభీర్.. వీడియో వైరల్!
- కేఎల్ రాహుల్ తన మెరుపు బ్యాటింగ్
- 19 బంతుల్లోనే 39 పరుగులు చేసిన రాహుల్
- బిత్తరపోయిన గౌతమ్ గంభీర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir Stunned by KL Rahul’s Six: భారత్-అఫ్గానిస్థాన్ మధ్య ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో రాహుల్ కేవలం 19 బంతుల్లోనే 39 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రాహుల్ దూకుడు ఇన్నింగ్స్‌కు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫిదా అయ్యాడు. ఓ సిక్సర్‌కు అయితే ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
195 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌కు శుభ్‌మన్ గిల్ అద్భుత ఆరంభాన్ని అందించగా.. చివర్లో కేఎల్ రాహుల్ తనదైన శైలిలో మ్యాచ్‌ను ముగించాడు. రాహుల్ ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, మూడు భారీ సిక్సర్లు ఉన్నాయి. ముఖ్యంగా అతడు కొట్టిన ఓ భారీ సిక్సర్‌కు డగౌట్లో కూర్చున్న కోచ్ గౌతమ్ గంభీర్ బిత్తరపోయాడు. జియా ఉర్ రెహ్మాన్ షరీఫీ బౌలింగ్‌లో రాహుల్ లాంగ్ ఆన్ దిశలో భారీ సిక్సర్ బాదాడు. ఆ షాట్ చూసిన గంభీర్.. అబ్బా ఏం షాట్ ఆడాడు అన్నట్టు ఓ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఆ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read
- Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
వన్డే జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్న లోకేష్ రాహుల్.. ఈ మ్యాచ్ ద్వారా తాను అవసరమైతే టి20 శైలిలోనూ వేగంగా పరుగులు చేయగలనని నిరూపించాడు. మిడిల్ ఓవర్లలో సహచర ఆటగాడిపై ఒత్తిడిని తగ్గిస్తూ.. చివర్లో వేగం పెంచే తన సామర్థ్యాన్ని మరోసారి చూపించాడు. 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాల నేపథ్యంలో ఈ ఇన్నింగ్స్ భారత జట్టు యాజమాన్యానికి కూడా మంచి సంకేతంగా మారింది. శుభ్‌మన్ గిల్ అజేయ 84 పరుగులు, రాహుల్ మెరుపు 39 పరుగులతో భారత్ 22.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సంపాదించింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!