Site icon NTV Telugu

Gambhir-Kohli: గంభీర్‌తో కోహ్లీ మాట్లాడడా?.. డ్రెస్సింగ్ రూమ్ రహస్యాలు చెప్పిన బ్యాటింగ్ కోచ్!

Gambhir Kohli

Gambhir Kohli

Gautam Gambhir and Virat Kohli Relationship: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మధ్య సంబంధాలు అంతగా లేవని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తుంటాయి. విరాట్, గౌతమ్‌లు ఒకరితో ఒకరు మాట్లాడుకోరని కూడా న్యూస్ చక్కర్లు కొడుతుంటాయి. ఈ ఊహాగానాలకు భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ పులిస్టాప్ పెట్టారు. న్యూజిలాండ్‌తో జరిగే రెండవ వన్డేకు ముందు విరాట్-గంభీర్ మధ్య సంబంధం గురించి ఆయన కీలక సమాచారం వెల్లడించారు. ఇద్దరు మాట్లాడుకుంటారని, జట్టు ప్రణాళికల విషయంలో చర్చిస్తారని సితాన్షు స్పష్టం చేశారు.

Also Read: Dadasaheb Phalke Biopic: ‘దాదా సాహెబ్ ఫాల్కే’ బయోపిక్ ఈజ్‌ ఆన్‌.. మార్చికి పోస్ట్ పోన్!

‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వ్యూహరచన చేస్తారు. ఇప్పుడు ఇద్దరూ ఒకే ఫార్మాట్‌లో ఆడుతున్నారు కాబట్టి ప్రతి మ్యాచ్‌లో భారత్ గెలవాలని కోరుకుంటారు. ఇద్దరికీ చాలా అనుభవం ఉంది. రో-కోలు తమ ఆలోచనలను ఇతర ఆటగాళ్లతో పంచుకుంటారు. అంతేకాదు సహచర ఆటగాళ్లతో గేమ్ గురించి చర్చిస్తారు. ఇద్దరు కోచ్ గౌతమ్‌ గంభీర్‌తో మాట్లాడతారు. వన్డే ఫార్మాట్, ప్రపంచకప్ 2027 గురించి చర్చిస్తారు. నేను తరచుగా వాళ్లతోనే ఉంటాను, వారి మాటలను నేను వింటుంటా. రో-కోలు తమ అనుభవాలను పంచుకుంటారు. సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తుంటాయి. అవేమీ మేం పెద్దగా పట్టించుకోము’ అని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ చెప్పారు.

Exit mobile version