భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పనిభారం కారణంగా తాను టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు తాజాగా ముగిసిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కు ముందు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వైట్ బాల్ ఫార్మాట్ లో ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదు అని వన్డే కెప్టెన్సీ నుండి కూడా కోహ్లీని తొలగించి ఆ రెండు బాధ్యతలను భారత స్టార్ ఓపెనర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు అప్పగించింది. దాంతో బీసీసీఐ పై చాలా విమర్శలు వచ్చాయి.
అయితే తాజాగా ఈ విషయం పై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మాట్లాడుతూ… కోహ్లీ పనిభారం తనకు తెలుసు అని అన్నాడు. జట్టులో టాప్ బ్యాటర్ గా ఉంటూ.. కెప్టెన్సీ నిర్వర్తించడం అంత సులువు కాదు. బాగా ఒత్తిడి ఉంటుంది. అది నాకు తెలుసు. ఎందుకంటే.. నేను కూడా జట్టుకు కెప్టెన్ గా వ్యవరించాను అని గంగూలీ అన్నారు. ఇక వన్డే కెప్టెన్ గా నియమించబడిన రోహిత్ రాబోయే సౌత్ ఆఫ్రికా పర్యటనలోని వన్డే సిరీస్ లో ఆ బాధ్యతలను అందుకోనున్నాడు.