ప్రస్తుతం యూఏఈ లో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు కనీసం సెమీస్ కు కూడా చేరుకోకుండా నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీతో జట్టు హెడ్ కోచ్ గా రవిశాస్త్రి పదవీకాలం ముగియడంతో ఆ స్థానంలో మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ ను ఆ స్థానంలో నియమించింది బీసీసీఐ. అయితే తాజాగా ద్రావిడ్ ను హెడ్ కోచ్ గా ఎందుకు ఎంపిక చేసారు అని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీని ప్రశ్నించగా.. దానికి దాదాహ్ సమాధానం ఇస్తూ ద్రావిడ్ కొడుకు చెప్పాడని పెట్టుకున్నాము అంటూ సరదాగా సమాధానం చెప్పాడు. ద్రావిడ్ కొడుకు నాకు ఫోన్ చేసి.. మా నాన్న చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నాడు అని చెప్పాడు. దాంతో ద్రావిడ్ నుండి తనను తప్పించడానికి ఈ పోస్ట్ ఇచ్చాం అంటూ సమాధానం చెప్పాడు గంగూలీ. అయితే దాదా సరదాగా చెప్పిన ఈ సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
హెడ్ కోచ్ ద్రావిడ్ ఎంపిక పై గంగూలీ జోకులు…!
