AB de Villiers: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓడిపోయింది. దాంతో అందరూ ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పేసర్లకు అనుకూలించడం, స్పిన్నర్లకు సరిపడా టర్న్ రావడంతో మ్యాచ్ రెండో రోజు పూర్తిగా బౌలర్ల ఆధీనంలోకి పోయింది. ఈ పరిస్థితిని చక్కగా ఉపయోగించుకున్న సఫారీ జట్టు స్పిన్నర్ సైమన్ హార్మర్ 8 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
Read Also: Nitish Kumar: బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం.. హాజరైన ప్రధాని మోడీ..
ఇక, మ్యాచ్ ముగిసిన అనంతరం భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ.. పిచ్‌ను సమర్థిస్తూ, తాము బ్యాటింగ్ బాగా చేసుంటే రన్స్ చేయడానికి అవకాశం ఉందన్నారు. అయితే, గంభీర్ కామెంట్స్ ఇప్పుడు రచ్చకు దారి తీశాయి. దీనిపై స్పందించిన దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ.. టీమిండియా కోచ్ గంభీర్ సొంత జట్టుపై పరోక్షంగా విమర్శలు చేశారు.. కళ్ళు మూసుకునేలోపే ఈ మ్యాచ్ కంప్లీట్ అయిందన్నారు.
Read Also: Supreme Court: “బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతికి గడువు విధించలేం”.. సుప్రీం సంచలన తీర్పు..
అయితే, గత ఐదేళ్లుగా భారత్ సొంత మైదానాల్లో ఓటములు పెరుగుతున్నాయి.. ఇది ఆందోళనకరమైన విషయం అని ఏబీ డివిలియర్స్ పేర్కొన్నారు. గతంలో భారత్‌ను సొంతగడ్డపై ఓడించడం చాలా కష్టంగా ఉండేది.. కానీ ఇటీవల కాలంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.. వారు ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయారు. ఇక, స్పిన్‌కు టీమిండియా బ్యాటర్లు బలహీనులయ్యారా? అని నేను అనుకోవడం లేదన్నారు. ప్రత్యర్థి జట్లు ఇండియన్ పరిస్థితులను బాగా అర్థం చేసుకుంటున్నాయని సౌతాఫ్రికా మాజీ ఆటగాడు అన్నారు. కాగా, ఈడెన్ గార్డెన్స్ పిచ్ తొలి రోజు ఫస్ట్ హాఫ్ లో బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ, రెండో రోజు బ్యాటర్లకు అనుకూలంగా పూర్తిగా మారిపోయింది. అయితే, నవంబర్ 22వ తేదీన గువాహటిలో రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. సిరీస్‌లో వెనుకబడిన భారత్ తప్పనిసరిగా గెలవాల్సి ఉంది.
