NTV Telugu Site icon

Football: ఫుట్‌బాల్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. హాట్‌టాపిక్‌గా వైట్ కార్డ్

Untitled Design 49

Untitled Design 49

ఫుట్‌బాల్‌ను ఫాలో అయ్యే ప్రేక్షకులకు ఎల్లో, రెడ్ కార్డుల గురించి తెలిసే ఉంటుంది. గ్రౌండ్‌లో ప్లేయర్స్ దురుసుగా ప్రవర్తిస్తుంటే రిఫరీలు ఈ కార్డులను చూపిస్తుంటారు. దీని వల్ల అప్పటికప్పుడు ఫీల్డ్ నుంచి బయటకు పంపించేయడం, తర్వాత మ్యాచ్ ఆడకుండా నిషేధించడంలాంటి చర్యలు ఉంటాయి. అయితే ఈ ఆటలో మరో కార్డు కూడా ఉందన్న విషయం చాలామందికి తెలియదు. ఇది ప్లేయర్లను శిక్షించడానికి మాత్రం కాదు. బాగా ఆడినందుకు మెచ్చుకుంటూ ఇచ్చేది. అదే వైట్ కార్డు. ఫుట్‌బాల్ హిస్టరీలో ఇప్పటివరకు ఈ వైట్‌కార్డును రిఫరీలు ఉపయోగించిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ఓ విమెన్స్ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో ఈ కార్డు కనిపించింది. దీంతో నెట్టింట ఇప్పుడంతా ఈ కార్డు గురించే చర్చ. మరి ఈ కార్డు విషయాలేంటో చూద్దామా.

అసలు ఈ వైట్ కార్డు ఎందుకు!
పోర్చుగల్‌లో జరిగిన ఓ విమెన్స్ మ్యాచ్‌లో ఈ వైట్ కార్డు కనిపించింది. బెన్ఫికా-స్పోర్టింగ్ లిస్బన్ మధ్య ఆ మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా రిఫరీ ఆకస్మాత్తుగా తన జేబులో నుంచి ఓ వైట్ కార్డు తీసి చూపించాడు. ఇది చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యంతోపాటు ఆనందానికి కూడా గురయ్యారు. రిఫరీ చేసిన పనిని అభినందిస్తూ గట్టిగా చప్పట్లతో ప్రశంసించారు. కాగా ఈ తాజా మ్యాచ్ సందర్భంగా స్టాండ్స్‌లో ఉన్న ఓ అభిమాని సడెన్‌గా అస్వస్థతకు గురయ్యాడు. అది చూసిన రెండు జట్ల మెడికల్ టీమ్స్ హుటాహుటిన ఆ అభిమాని దగ్గరికు వెళ్లి చికిత్స అందించాయి. వాళ్ల క్రీడాస్ఫూర్తిని అభినందిస్తూ రిఫరీ వైట్ కార్డు చూపించాడు. ఓ మ్యాచ్ సందర్భంగా ఫెయిర్ ప్లే ఆడుతున్న ఈ టీమ్స్‌ను అభినందిస్తూ ఈ వైట్ కార్డును ప్రవేశపెట్టారు. దీనివల్ల ఫీల్డ్‌లో మంచి వాతావరణంలో మ్యాచ్ జరుగుతుందన్నది ఫిఫా ఉద్దేశం. పోర్చుగల్‌లో ఈ వైట్ కార్డును తొలిసారి పరిచయం చేశారు.

కోహ్లీ డబుల్ సెంచరీ చేశాడా? హర్ష గోయెంక ట్వీట్‌పై నెటిజన్ల కామెంట్స్