NTV Telugu Site icon

Stump Out: టెస్ట్ మ్యాచ్‌లో అరుదైన సీన్.. 145 ఏళ్ల పురుషుల క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి

New Zealand

New Zealand

Stump Out: ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య కరాచీ వేదికగా తొలి టెస్టు జరుగుతోంది. అయితే ఈ టెస్టులో అరుదైన సీన్ చోటు చేసుకుంది. దీంతో 145 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఎన్నడూ చూడని రికార్డును న్యూజిలాండ్ కీపర్ బ్లండెల్ సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా తొలి రెండు వికెట్లను స్టంపౌట్ రూపంలోనే కోల్పోయింది. అబ్దుల్లా షఫిఖ్ (7), షాన్‌ మసూద్‌ (3)ను న్యూజిలాండ్ కీపర్ బ్లండెల్ స్టంపౌంట్ ద్వారా అవుట్ చేశాడు. ఓ టెస్ట్ మ్యాచ్‌లో తొలి రెండు వికెట్లు స్టంపౌట్ కావడం పురుషుల క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.

Read Also: Sergey Lavrov: యుద్ధం ముగించాలంటే.. ఉక్రెయిన్ ఆ షరతుల్ని పూర్తి చేయాలి

అయితే ఓవరాల్‌గా క్రికెట్ చరిత్రలో మాత్రం ఇది రెండోసారి. గతంలో 1976లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా మహిళా జట్టు స్టంపౌట్ల రూపంలో వికెట్లను దక్కించుకుంది. ఇప్పుడు రెండో జట్టుగా న్యూజిలాండ్ పురుషుల క్రికెట్ జట్టు నిలిచింది. కాగా తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ భారీ సెంచరీతో చెలరేగాడు. అతడు 161 పరుగులు చేయగా మరో యువ క్రికెటర్ అఘా సల్మాన్ కూడా సెంచరీ బాదాడు. దీంతో పాకిస్థాన్ 438 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ బౌలర్లలో సౌధీ 3 వికెట్లు దక్కించుకోగా అజాజ్ పటేల్, మిచెల్ బ్రేస్‌వెల్ తలో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. అటు పాక్ తరఫున దాదాపు 16 ఏళ్ల కిందట మహమ్మద్‌ యూసఫ్ నెలకొల్పిన రికార్డును బాబర్‌ ఆజమ్ అధిగమించాడు. ఒకే క్యాలెండర్‌ ఏడాదిలో (2006) అన్ని ఫార్మాట్లలో కలిపి యూసఫ్‌ 33 మ్యాచుల్లో 2,435 పరుగులు చేయగా.. దానిని బాబర్ ఆజమ్ బద్దలు కొట్టాడు.