సెంచూరియన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో వరుణుడు తన ప్రతాపం చూపించాడు. రెండో రోజు ఆటను పూర్తిగా అడ్డుకున్నాడు. దీంతో రెండో రోజు ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. వర్షం పలు మార్లు అంతరాయం కలిగించడంతో మైదానం మొత్తం చిత్తడిగా మారింది. ఈ నేపథ్యంలో రెండో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
Read Also: టెస్టుల్లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు
కాగా తొలి రోజు ఆటలో దక్షిణాఫ్రికాపై టీమిండియానే పైచేయి సాధించింది. కేఎల్ రాహుల్ సెంచరీతో రాణించడంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 272/3 స్కోరు సాధించింది. రెండో రోజు మరిన్ని పరుగులు చేసి దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాలనే టీమిండియా ప్రణాళికలను వరుణుడు అడ్డుకోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. మయాంక్ అగర్వాల్ 60 పరుగులు, కోహ్లీ 35 పరుగులు చేయగా పుజారా మాత్రం డకౌట్ అయ్యాడు.
