Fatima Sana: ఆధిపత్యం మాదే, మేమే గెలవాల్సింది.. కానీ అదే మా కొంపముంచింది!
- పాకిస్థాన్ మహిళల జట్టు దారుణ ఓటమి
- భారత్‌పై 64 పరుగుల భారీ తేడాతో ఓటమి
- ఓటమి చాలా నిరాశ కలిగించింది
- పవర్‌ప్లేలో మేమే బాగా ఆడాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Captain Fatima Sana After India Defeat: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ మహిళల జట్టు దారుణ ఓటమిని మూటగట్టుకుంది. ఆదివారం బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో భారత్‌పై 64 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. 171 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్ 17 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటైంది. భారీ ఓటమి తర్వాత పాకిస్థాన్ మహిళల జట్టు కెప్టెన్ ఫాతిమా సనా తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది. తమ ఓటమికి బ్యాటింగే ప్రధాన కారణం అని అంగీకరించింది. బ్యాటింగ్ ఆరంభం చూస్తే.. తామే మ్యాచ్ గెలవాల్సిందని, భారత స్పిన్నర్లు దాటి చేయడంతో వరుసగా వికెట్స్ కోల్పోయి మూల్యం చెల్లించుకున్నాం అని తెలిపింది. ఇంకా టోర్నీ చాలా మిగిలి ఉందని, తదుపరి మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందని ఫాతిమా సనా చెప్పుకొచ్చింది.
ఓటమి చాలా నిరాశ కలిగించింది:
మ్యాచ్ అనంతరం ఫాతిమా సనా మాట్లాడుతూ.. ‘ఈ ఓటమి చాలా నిరాశ కలిగించింది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో మేము ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాం. ప్రపంచకప్‌లో ఇంకా చాలా మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. కాబట్టి తదుపరి మ్యాచ్‌ల్లో తప్పకుండా మెరుగైన ప్రదర్శన చేయాలి. భారత్ ఇన్నింగ్స్ సందర్భంగా మొదటి 15 ఓవర్ల వరకు మేము బాగా బౌలింగ్ చేశాం. కానీ ఆ తర్వాత కొన్ని అదనపు పరుగులు ఇచ్చాం. ఒక సందర్భంలో ఫీల్డర్ తప్పుగా లోపలికి రావడం కూడా మాకు నష్టం చేసింది. అలాంటి చిన్న తప్పిదాలను సరిదిద్దుకోవాలి’ అని తెలిపింది.
Also Read
- WI Coach: వెస్టిండీస్ క్రికెట్‌ను కాపాడండి.. దయచేసి ఆర్థిక సాయం చేయండి.. హెడ్ కోచ్ డారెన్ సామీ ఆవేదన..
- Shai Hope: "మా 20 ఏళ్ల కల నెరవేరలేదు.. అయినా నేను ఫుల్ హ్యాపీ".. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కీలక వ్యాఖ్యలు..
- IPL 2027 Mini Auction: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముహూర్తం ఖరారు.. ఈసారి వేదిక ఎక్కడో తెలుసా?
- Naman Dhir: యువరాజ్ సింగ్ 19 ఏళ్ల రికార్డు బ్రేక్.. 6 బంతుల్లోనే నమన్ ధీర్ విధ్వంసం..
ఫీల్డింగ్‌లో తప్పిదాలు చేశాం:
మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టుకు స్లో ఓవర్ రేట్ పెనాల్టీ విధించడంపై కూడా ఫాతిమా స్పందించింది. ‘భారత్ బ్యాటర్ల లెఫ్ట్-రైట్ కలయిక కారణంగా ఫీల్డ్ సెట్టింగ్స్ మార్చాల్సి వచ్చింది. మా జట్టు యువ ఆటగాళ్లతో నిండి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అనుభవం పెరిగే కొద్దీ వారు మరింత మెరుగ్గా వ్యవహరిస్తారు. ఫీల్డింగ్‌లో చేసిన పొరపాట్లు మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేశాయి. క్యాచ్‌లు మ్యాచ్‌లను గెలిపిస్తాయి. కానీ మేము కొన్ని కీలక క్యాచ్‌లు వదిలేశాం. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లే ఆ అవకాశాలను చేజార్చడం బాధాకరం. బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లో కూడా మెరుగుపడాలి. ఎందుకంటే ఫీల్డింగ్‌లో చేసే చిన్న తప్పిదం మొత్తం మ్యాచ్‌ను ప్రభావితం చేస్తుంది’ అని ఫాతిమా సనా పేర్కొంది.
పవర్‌ప్లేలో మేమే బాగా ఆడాం:
పవర్‌ప్లేలో తమ జట్టు మెరుగ్గా ఆడిందని పాక్ కెప్టెన్ ఫాతిమా చెప్పింది. అయితే ఆ తర్వాత బ్యాటింగ్ పూర్తిగా కుప్పకూలిందని అంగీకరించింది. ‘బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ పవర్‌ప్లేలో మేమే బాగా ఆడాం. కానీ ఆ తర్వాత బ్యాటింగ్‌లో వరుసగా వికెట్లు కోల్పోయాం. అదే మ్యాచ్‌ను మా చేతుల్లో నుంచి జార్చేసింది. భారత బౌలర్లు ఒత్తిడి పెంచారు. అందరూ బాగా బౌలింగ్ చేశారు. భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు సాధించాలంటే బ్యాటింగ్‌లో స్థిరత్వం తీసుకురావాలి’ అని ఫాతిమా తెలిపింది. భారత్‌పై భారీ ఓటమితో పాకిస్థాన్ ప్రపంచకప్ ప్రచారాన్ని నిరాశాజనకంగా ప్రారంభించినప్పటికీ.. యువ జట్టు కావడంతో త్వరగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయని ఫాతిమా సనా ఆశాభావం వ్యక్తం చేసింది. తదుపరి మ్యాచ్‌ల్లో తప్పిదాలను సరిదిద్దుకుని బలంగా తిరిగి రావడమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
PM-VBRY Scheme 2026: తొలిసారి ఉద్యోగం చేసేవారికి రూ.15,000.. రెండో విడత డబ్బుల కోసం ఈ కోర్సు తప్పనిసరి!
-
Jailer 2: జస్ట్ 5 నిమిషాల క్యామియోకి రూ.25 కోట్లా?
-
Ramayana: సహ నిర్మాతగా ఉన్నందుకేనా? రణబీర్‌ను డామినేట్ చేస్తున్న యశ్!
-
JD Vance: వలసల్ని ప్రోత్సహించి అనుభవిస్తున్నారు.. ఫ్రాన్స్ అల్లర్లపై యూఎస్ ఉపాధ్యక్షుడు..
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G లాంచ్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, Super AMOLED డిస్ప్లే!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!