Site icon NTV Telugu

IPL-2022: ఆర్‌సీబీకి కెప్టెన్ దొరికేసినట్లేనా?

ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ వైదొలగడంతో కొత్త కెప్టెన్ కోసం వెతికే పనిలో ఆ జట్టు ఉంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న వేలంలో శనివారం రోజు ఆర్‌సీబీ జట్టు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్‌ను రూ.7 కోట్లకు దక్కించుకుంది. అయితే ఆర్సీబీ 100 శాతం డుప్లెసిస్‌నే సారథిగా ప్రకటిస్తుందని మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. అతడు జట్టులో ఉండటం వల్ల సమతూకం వస్తుందని, ఐపీఎల్‌లో అతడికి అద్భుతమైన రికార్డులు ఉన్నాయన్నాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోవడం డుప్లెసిస్‌కు ప్లస్ పాయింట్ అవుతుందన్నాడు.

Read Also: IPL 2022 Auction: భారత ప్లేయర్లకు కాసుల పంట

ఐపీఎల్‌లో ఆర్‌సీబీ జట్టు ఇప్పటివరకు టైటిల్ గెలవలేదు. ఈ ఏడాది జరిగే లీగ్‌లోనైనా టైటిల్ గెలవాలని ఆ జట్టు తహతహలాడుతోంది. అందుకు తగ్గట్లే హిట్టర్లు, ఆల్‌రౌండర్లపై ఆ జట్టు దృష్టి పెట్టింది. మరోవైపు ఐపీఎల్ మెగా వేలం రెండోరోజు కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ మార్‌క్రమ్‌ను రూ.2.6 కోట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు దక్కించుకుంది. అటు టీమిండియా ఆటగాడు ఆజింక్యా రహానెను రూ.కోటితో కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది.

Exit mobile version