Robin Uthappa: పీఎఫ్ చెల్లింపుల వివాదంలో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప చిక్కుకున్నారు. బెంగళూరుకు చెందిన సెంటారస్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఉతప్పడైరెక్టర్‌గా ఉన్నారు. ఇక, ఇందులో పని చేసే ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ నిధులు చెల్లించలేదని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారానికి సంబంధించి ఇటీవల అతడిపై పోలీసులు అరెస్టు వారెంట్ జారీ చేశారు. అయితే, ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది.
Read Also: Range Rover Sport Launched: భారత్‌లో తొలి మెడ్ ఇన్ ఇండియా రేంజ్ రోవర్ స్పోర్ట్ SUV లాంచ్
అయితే, ఈ కంపెనీలో పని చేసే ఉద్యోగుల నుంచి పీఎఫ్‌ను కట్ చేసినప్పటికీ వాటిని ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేయడం లేదని ఆరోపించారు. దాదాపు రూ.23 లక్షలను రాబిన్ ఉతప్ప తన ఉద్యోగుల ఖాతాలో జమ చేయకుండా మోసం చేసినట్లు తేలడంతో పీఎఫ్ రీజనల్ కమిషనర్ అతడికి నోటీసులు ఇచ్చారు. వాటిని అందజేసేందుకు డిసెంబర్ 4వ తేదీన పులకేశినగర్‌లోని మాజీ క్రికెటర్ ఇంటికి వెళ్లారు. అతడు అక్కడ లేకపోవడంతో దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని పీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ స్థానిక పోలీసులను ఆదేశాలు జారీ చేసినట్లు పలు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
Read Also: RK Roja Open Challenge: ప్రభుత్వానికి రోజా సవాల్.. నేను చేసిన అవినీతి ఏంటి..?
కాగా, ఈ క్రమంలోనే మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పపై అరెస్టు వారెంట్ జారీ అయింది. డిసెంబర్ 27వ తేదీలోగా అతడు పూర్తి బకాయిలు చెల్లించాలి.. లేదంటే అరెస్టు చేస్తామని ఆ వారెంట్‌లో తెలిపారు. ప్రస్తుతం ఉతప్ప కుటుంబం దుబాయ్‌లో నివాసం ఉంటున్నారు. ఇక, రాబిన్ ఉతప్ప టీమిండియా తరఫున 59 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడాడు. 54 వన్డేల్లో 1,183 రన్స్ చేయగా.. ఇందులో ఏడు హాప్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఐపీఎల్‌లోనూ పలు టీమ్స్ కు ప్రాతినిధ్యం వహించాడు ఉతప్ప.