BuzBall Cricket: తగ్గేదే లే.. మేం ఇలానే ఆడుతాం! బెన్ స్టోక్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
England Captain Ben Stokes react on BuzBall Cricket vs Australia: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ 2023 ( Ashes 2023)లో భాగంగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్‌ను ఆస్ట్రేలియా ఓడించిన విషయం తెలిసిందే. ‘బజ్‌బాల్’ అంటూ దూకుడుగా ఆడిన ఇంగ్లండ్‌కు ఆసీస్ భారీ షాక్ ఇచ్చింది. వర్షం కారణంగా చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలిచింది. మ్యాచ్ ఓటమిపై స్టోక్స్ తనదైన శైలిలో స్పందించాడు. తొలి మ్యాచ్ గెలిచిన కమిన్స్ సేన ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే మ్యాచ్ ఓడిపోయామన్న బాధ ఉన్నా.. బజ్‌బాల్ క్రికెట్ విషయంలో వెనక్కి తగ్గేదే లే అని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మ్యాచ్ అనంతరం ఇంగ్లీష్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ… ‘తొలి టెస్ట్ మ్యాచ్‌ను చివరి వరకూ తీసుకెళ్లినందుకు చాలా గర్వంగా ఉంది. ఇదొక అద్భుతమైన మ్యాచ్. టెస్టు మొత్తం అభిమానులను కుర్చీల్లో కూర్చోనీయకుండా చేయడంలో మేం విజయవంతం అయ్యాం. ఇలా ఉత్కంఠభరితంగా మ్యాచ్‌లు జరగడంతోనే.. టెస్టు క్రికెట్‌కు, యాషెస్ సిరీస్‌కు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. తొలి టెస్టులో ఓటమి బాధించింది. అయితే మేం మాత్రం బజ్‌బాల్ క్రికెట్ విషయంలో వెనక్కి తగ్గము. మున్ముందు కూడా ఇదే ఆటను ప్రదర్శిస్తాం. దూకుడుగా ఆడుతూ ఆస్ట్రేలియాకు కఠిన సవాల్ విసురుతాం. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. సరైనదిగానే భావిస్తాం’ అని అన్నాడు.
Also Read
- Ben Stokes: గుర్తుపట్టలేని స్థితిలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. నెటిజన్లు షాక్..
- RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
- Accident: ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఘోర ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ కెప్టెన్ ..
- Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’
‘తొలి ఇన్నింగ్స్‌లో త్వరగా డిక్లేర్డ్ చేయడంపై చాలా మంది విమర్శలు చేశారు. ఆస్ట్రేలియాపై ఆధిక్యం ప్రదర్శించేందుకే ఆ నిర్ణయం తీసుకున్నాం. రోజు చివరి 20 నిమిషాల్లో బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. జో రూట్ లేదా జేమ్స్ ఆండర్సన్ వికెట్లు ఎప్పుడు పడతాయో ఎవరికి తెలుసు?. ఒకవేళ పడితే మేం అదే స్కోరు వద్ద ఆలౌట్ అయ్యేవాళ్లం. సిరీస్‌లో ఇది తొలి మ్యాచ్ మాత్రమే. ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఉన్నాయి. మేం ఇంకా చాలా క్రికెట్ ఆడాలి. ఇప్పుడు మా ఫోకస్ అంతా వచ్చే మ్యాచ్‌లపైనే ఉంది’ అని బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు. రెండో టెస్టు జూన్ 28 నుంచి జూలై 2 వరకు లార్డ్స్ వేదికగా జరగనుంది.
Also Read: Strong Bones Food: 30 ఏళ్ల తర్వాత వీటిని తింటే.. ఎముకలు దృఢంగా ఉంటాయి!
తాజావార్తలు
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్‌కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్‌పై సర్వత్రా ఆసక్తి
-
Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
-
ALP: ఒంగోలులో లోకో పైలట్‌పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!