లీడ్స్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో బ్యాటింగ్‌లో 100 సిక్సర్లు కొట్టి బౌలింగ్‌లో100 వికెట్లు తీసిన ఆటగాడిగా స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. లీడ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో స్టోక్స్ 18 పరుగులు చేశాడు. ఈ సిక్సర్‌తో టెస్టుల్లో 100 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా స్టోక్స్ నిలిచాడు. ఇప్పటి వరకు అతడు 81 టెస్టులు ఆడి మొత్తం 177 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 100 సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా ఆడమ్ గిల్‌క్రిస్ట్ గతంలో రికార్డు సాధించాడు. ఇంగ్లండ్ తరపున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లలో ఇయాన్ మోర్గాన్(328), బట్లర్(267), స్టోక్స్(207) ఉన్నారు.
కాగా ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 329 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడు 228 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో109 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌పై వరుసగా మూడు టెస్టుల్లోనూ మిచెల్ మూడు సెంచరీలు చేశాడు. టామ్ బ్లండెల్ (55)తో ఆరో వికెట్‌కు కీలకమైన 120 పరుగుల భాగస్వామ్యం అందించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ 5 వికెట్లతో చెలరేగాడు. సీనియర్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ 3 వికెట్లు తీయగా.. మ్యాటీ పాట్స్, జేమీ ఓవర్టన్ తలో వికెట్ సాధించారు. అనంతరం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. బెయిర్‌స్టో సెంచరీతో తన జట్టును ఆదుకున్నాడు.
Fifa World Cup: ‘వన్ నైట్ స్టాండ్’ అన్నారో.. ఏడేళ్ల జైలుశిక్ష గ్యారంటీ..!!
