NTV Telugu Site icon

ఐపీఎల్ 2021 : రాజస్థాన్ రాయల్స్ కు భారీ షాక్…

ఐపీఎల్ 2021 ఆరంభంలోనే భారీ షాక్ తగ్గిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ మొత్తం ఐపీఎల్ కే దూరమయ్యాడు. నెట్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో స్టోక్స్ చేయి విరగడంతో అతను పూర్తి ఐపీఎల్ కు అందుబాటులో ఉండటం లేదు. అయితే ఈ లీగ్ ప్రారంభం కాకముందే రాజస్థాన్ స్టార్ పేసర్ జొఫ్రా ఆర్చర్ కూడా చేతి గాయం కారణంగా ఇప్పటి వరకు జట్టుతో చేరలేదు. ఆర్చర్ అసలు ఈ ఐపీఎల్ లో ఆడుతాడా… లేదా అనే దాని పై ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ కు వ్యతిరేకంగా ఒక్కే ఒక్క మ్యాచ్ ఆడిన రాయల్స్ చివరి బంతి వరకు పోరాడి ఓడిపోయింది. ఆ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ చేసిన సెంచరీ కూడా వృధా అయ్యింది. ఇక ఈ సీజన్ లో స్టోక్స్, ఆర్చర్ లేకుండా రాజస్థాన్ ఎలా రాణిస్తుంది అనేది చూడాలి మరి.