Ben Stokes: రీఎంట్రీ అదుర్స్.. 64 బంతుల్లోనే స్టోక్స్ సెంచరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల గాయం కారణంగా క్రికెట్‌కు దూరమైన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అదిరిపోయే రీతిలో రీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం కౌంటీ క్రికెట్ ఆడుతున్న బెన్ స్టోక్స్ మైదానంలో తన విశ్వరూపం చూపించాడు. కౌంటీల్లో డుర్హామ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు 64 బంతుల్లోనే సెంచరీ చేసి తనలోని సత్తాను బయటపెట్టాడు. అంతేకాకుండా ప్రత్యర్థి జట్టు బౌలర్ వేసిన ఒకే ఓవర్లో 34 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు, ఫోర్ సాధించాడు. దీంతో బెన్ స్టోక్స్ ఈజ్ బ్యాక్ అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
కాగా ఇటీవల ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ నియమితుడైన సంగతి తెలిసిందే. యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లండ్ ఘోర పరాజయం కావడంతో పాటు బలహీనమైన వెస్టిండీస్ జట్టుపైనా టెస్టుల్లో ఓటమి పాలైంది. దీంతో ఈ ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ ఇంగ్లండ్ జట్టు టెస్ట్ కెప్టెన్సీకి జో రూట్ రాజీనామా చేశాడు. ఈ నేపథ్యంలో రూట్ వారసుడిగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు బెన్ స్టోక్స్‌ను నియమించింది. ఇంగ్లండ్ జట్టు త్వరలోనే సొంతగడ్డపై న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లతో టెస్టుల్లో తలపడనుంది. స్వార్థం లేని ఆటగాళ్లతో ఇంగ్లండ్ జట్టును టెస్టుల్లో ముందుకు నడిపిస్తానని.. సరైన కూర్పును ఎంచుకోవటమే టెస్టు మ్యాచ్‌లో విజయానికి ఉత్తమ మార్గం అని బెన్ స్టోక్స్ అభిప్రాయపడ్డాడు.
Also Read
- IND vs SL 2nd Test Day 4: కొలంబోలో వర్షం కారణంగా ముందుగానే ఆట ముగింపు.. ఎవరిది పైచేయి?
- IND vs SL: జడేజా ఖాతాలో చెత్త రికార్డు.. అందులో నంబర్ వన్!
- IND vs SL: చరిత్ర సృష్టించిన సోనల్ దినూష.. 15 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు
- Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. 'సూరీడు' కమ్‌బ్యాక్ అవుతాడా?
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..