గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో రష్యా వర్ధిల్లాలు అంటూ చేసిన నినాదాలు ఇప్పుడు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాయి. అలా చేసింది ఎవరో ప్రేక్షకులు కాదు.. వారితో పాటు టెన్నిస్ లెజెండరీ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ తండ్రి ఈ నినాదాలు చేయడం కొందరికి రుచించడం లేదు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఎలాంటి వివాదాలకు తావివ్వకూడదని రష్యా జెండాలను కూడా నిషేధించారు నిర్వాహకులు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ప్రపంచ దేశాలు రష్యాను ఒంటరిని చేశాయి. కానీ టెన్నిస్ స్టార్ ప్లేయర్ నొవాక్ జోకొవిచ్ తండ్రి మాత్రం అదే రష్యన్ మద్దతుదారులతో కలిసి ఫోటోలకు పోజులివ్వడం తీవ్ర దుమారం రేపుతోంది.
అసలేం జరిగింది..
మెల్‌బోర్న్‌లోని రాడ్ లేవర్ అరెనాలో జకోవిచ్ ఆడిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి అతని తండ్రి సర్డాన్ జకోవిచ్ వచ్చాడు. ఈ సందర్భంగా స్టేడియం బయట ఉన్న రష్యా మద్దతుదారులతో కలిసి అతడు ఫోటోలు దిగాడు. రష్యా వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశాడు. అంతేకాదు ఈ మ్యాచ్‌కు జెడ్ అనే అక్షరం ఉన్న టీషర్ట్ వేసుకొని వచ్చిన వ్యక్తితో కనిపించాడు. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి మద్దతిస్తున్న వాళ్ల చిహ్నం ఈ జెడ్ అనే అక్షరం. అలాంటి టీషర్ట్ వేసుకున్న వ్యక్తితో ఉండటం, రష్యాకు మద్దతుగా నినాదాలు చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పుతిన్ ఫోటో ఉన్న రష్యా జెండా పట్టుకున్న ఓ వ్యక్తి పక్కనే సర్డాన్ నిలబడిన వీడియో ఒకటి యూట్యూబ్‌లో కనిపించింది. మ్యాచ్ చూడటానికి రష్యా జెండాలతో వచ్చిన నలుగురు వ్యక్తులను వెంటనే స్టేడియం నుంచి బయటకు పంపించేశారు. ఈ జెండాలపై ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు నిషేధం విధించారు. ఆస్ట్రేలియాలో ఉక్రెయిన్ రాయబారిగా ఉన్న వాసిల్ మిరోష్నిచెంకో కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
#Novak Djokovic’s Father Filmed with Fans Holding Pro-Russia Flags at Australian Open
The Melbourne Age newspaper reported he said in Serbian: “Long live Russia.”
— Russian Market (@runews) January 26, 2023