Site icon NTV Telugu

Dinesh Karthik: శిఖర్ ధావన్ వన్డే కెరీర్ ముగిసినట్లే..!!

Shikar Dhawan

Shikar Dhawan

Dinesh Karthik: టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వన్డేల్లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వన్డే కెరీర్ ముగిసినట్లేనని అభిప్రాయపడ్డాడు. బంగ్లాదేశ్ పర్యటన అనంతరం స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో భారత్ వన్డే సిరీస్‌లు ఆడాల్సి ఉందని.. ఆ టోర్నీలకు ధావన్ జట్టులో చోటు దక్కించుకుంటాడో లేదో వేచి చూడాలన్నాడు. ఒకవేళ ఆయా సిరీస్‌లకు ధావన్‌కు చోటు దక్కకపోతే వన్డే ప్రపంచకప్‌లో కూడా అతడి స్థానం గల్లంతయినట్లే భావించాల్సి ఉంటుందని తెలిపాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్‌ వంటి ఆటగాళ్లను సెలక్టర్లు ఎలా దూరం పెట్టగలరని దినేష్ కార్తీక్ ప్రశ్నించాడు. ఓపెనర్‌గా జట్టుకు రోహిత్ అందుబాటులో ఉంటే ధావన్‌కు చోటు దక్కడం అనుమానమేనని చెప్పాడు.

Read Also: Flu Vaccine: అయ్యా.. బాబూ అంటూ సౌదీఅరేబియా రిక్వెస్టులు…. ఎందుకో తెలుసా?

మరోవైపు ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో ధావన్ ఒక్క మ్యాచ్‌లో కూడా డబుల్ డిజిట్ స్కోర్లు చేయలేదు. ఈ వన్డే సిరీస్‌లో వరుసగా అతడు 7, 8, 3 పరుగులు మాత్రమే చేశాడు. కానీ మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ మాత్రం డబుల్ సెంచరీతో దుమ్మురేపాడు. దీంతో ధావన్ అద్భుతమైన వన్డే కెరీర్ ముగింపు దశకు వచ్చినట్లే భావించాలని దినేష్ కార్తీక్ అన్నాడు. ఇప్పటికే టీ20 క్రికెట్‌కు ధావన్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారని.. ఇప్పుడు తన ప్రదర్శనతో వన్డేలకు కూడా దూరం కావాల్సిన పరిస్థితి ఉందన్నాడు. కాగా చివరి 9 వన్డేల్లో ధావన్ 8 మ్యాచ్‌ల్లో ఇబ్బంది పడ్డాడు. పాత కాలపు అప్రోచ్‌తో ఆడుతూ జట్టుకు తీవ్ర నష్టం చేస్తున్నాడు. పవర్ ప్లేలో వేగంగా ఆడలేక ఇబ్బంది పడుతున్నాడు.

Exit mobile version